central government selects 98 smart cities from all over the country

Full list of 98 smart cities

central government, smart cities, telugu states, venkaiah naidu, central government selects 98 smart cities from all over the country, 2 cities from telangana, 3 cities from andhra pradesh, smart cities project, hyderabad, warangal, vishakapatnam, kakinada, tirupathi, Arun jaitley, narendra modi, first budget session, NDA government

The government on Thursday released a list of 98 cities, including 24 state capitals, which are to be developed as smart cities.

స్మార్ట్ సిటీ జాబితాలో మార్పలు.. తెలుగు రాష్ట్రాలకు ఐదే.. ఇది ఫైనల్ అంటున్న కేంద్రం

Posted: 08/27/2015 06:11 PM IST
Full list of 98 smart cities

ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టులలో తెలుగు రాష్ట్రాలకు అదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. గతంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేయగా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు నగరాలను మాత్రమే ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక చేయగా, ఇప్పుడు వాటిలో రెండు సిటీలను తగ్గించి 98 సిటీలను మాత్రమే స్మార్ట్ గా మారుస్తామని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ స్మార్ట్ సిటీల వివరాలను వెల్లడించారు.

గతంలో ఆంద్రప్రదేశ్ నుంచి కర్నూలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరు నగరాలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం భావించగా, తాజాగా కేవలం విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలను మాత్రమే స్మార్ట్ సిటీలుగా చేయనున్నామని ప్రకటించింది. అయితే ఇందులోనూ తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యినే ఇచ్చింది. గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ ఐదు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన కేంద్రం తాజాగా కేవలం గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను మాత్రమే స్మార్ట్ సిటీలుగా రూపోందిస్తామని ప్రకటించింది.

గత సంవత్సరంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ సందర్భంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలను ఎంపిక చేస్తామని చెప్పగా, తాజాగా 98 సిటీలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం 100 నగరాలను అభివృద్ధి చేసేందుకు రూ. 6వేల కోట్లను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 98 నగరాలకు ఇక మహార్ధశ రానుంది. జమ్మాకాశ్మీర్ లో స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం నగరాన్ని ఎంపిక చేసేందుకు ఆక్కడి రాష్ట్ర ప్రభుత్వం మరికోంత సమయాన్ని కావాలని కోరింది. ఇక ఇటు ఉత్తర్ ప్రదేశ్ లో 13 నగరాలకు బదులుగా 12 నగరాలను మాత్రమే అక్కడి ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మరో నగరం ఎంపిక విషయంలో కొంత వ్యవధిని కోరడంతో కేవలం 98 నగరాలతో కేంద్రం తాజా జాబితాను వెల్లడించింది.

తాజాగా ప్రకటించిన స్మార్ట్ సిటీలు ఇవే...


అండమాన్ మరియు నికోబార్ దీవులు
1) పోర్ట్ బ్లెయిర్

ఆంధ్ర ప్రదేశ్
1) విశాఖపట్నం 2) తిరుపతి 3) కాకినాడ

అరుణాచల్ ప్రదేశ్
1) పసి

అస్సాం
1) గౌహతి

బీహార్
1) ముజఫర్పూర్ 2) భాగల్పూర్ 3) బిహార్ షరీఫ్

పంజాబ్
1. చండీగఢ్

ఛత్తీస్గఢ్
1) రాయ్పూర్ 2) బిలాస్పూర్

దాద్రా మరియు నాగర్ హవేలీ
1) సిల్వాస్సా

డామన్ మరియు డయ్యు
1) డీయ్యు

ఢిల్లీ
1.ఢిల్లీ (ఎన్డిఎంసి)

గోవా
1) పనాజి

గుజరాత్
1) గాంధీనగర్ 2) అహ్మదాబాద్ 3) సూరత్ 4) వడోదర 5) గతం 6) దహోడ్

హర్యానా
1) కర్నాల్ 2) ఫరీదాబాద్

హిమాచల్ ప్రదేశ్
1) ధర్మశాల

జార్ఖండ్
1) రాంచీ

కర్ణాటక
1) మంగళూరు, 2) బెలగావి, 3) శివమొగ్గ, 4) హబ్బాలీ-ధార్వాడ్, 5) తుముకూరు, 6) దేవంగరి

కేరళ
1) కొచీ

లక్షద్వీప్
1) కవర్రటీ

మధ్యప్రదేశ్
1) భూపాల్, 2) ఇండోర్, 3) జబల్పూర్, 4) గౌలియార్, 5) సాగర్, 6) సత్నా, 7) ఉజ్జయినీ

మహారాష్ట్ర
1) నవీ ముంబై, 2) నాసిక్, 3) థానే, 4) గ్రేటర్ ముంబై, 5) అమరావతి, 6) సోలాపూర్, 7) నాగ్పూర్, 8) కళ్యాణ్-Dombivali, 9) ఔరంగాబాద్, 10) పూనే

మణిపూర్
1) ఇంఫాల్

మేఘాలయ
1) షిల్లాంగ్

మిజోరం
1) ఏయిసావ్ల్

నాగాలాండ్
1) కోహిమా

ఒడిషా
1) భువనేశ్వర్, 2) రూర్కెలా

పుదుచ్చేరి
1) ఔల్గరెట్

పంజాబ్
1) లుధియానా, 2) జలంధర్ 3) అమృత్సర్

రాజస్థాన్
1) జైపూర్, 2) ఉదయపూర్, 3) కోటా, 4) అజ్మీర్

సిక్కిం
1) నామ్చి

తమిళనాడు
1) తిరుచిరాపల్లి, 2) చెన్నై, 3) తిరుప్పూర్, 4) కోయంబత్తూరు, 5) వెల్లూర్, 6) సేలం, 7), 8) తంజావూరు, 9) తిరునల్వేలి, 10) దిండిగల్ 11) మధురై, 12) తూతుకూడి ఈరోడ్

తెలంగాణ
1) గ్రేటర్ హైదరాబాద్, 2) గ్రేటర్ వరంగల్

త్రిపుర
1) అగర్తల

ఉత్తరప్రదేశ్
1) మోరాడాబాద్, 2) అలిగర్, 3) షహరాన్పూర్, 4) బారెల్లీ, 5) ఝాన్సీ, 6) కాన్పూర్, 7) అలహాబాద్ 8) లక్నో, 9) వారణాసి, 10) ఘజియాబాద్, 11) ఆగ్రా, 12) రాంపూర్

ఉత్తరాఖండ్
1) డెహ్రాడూన్

పశ్చిమ బెంగాల్
1) న్యూ టౌన్ కోలకతా, 2) Bidhannagar, 3) దుర్గాపూర్, 4) హల్దియా


= = = = = = = = = = = = = = = = = = = = = = = = =


కాగా కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటంచిన స్మార్ సిటీలు ఇవి..


మహారాష్ట్ర
1. పూణే, 2.  ముంబై, 3.  నాగ్పూర్, 4.  నాసిక్, 5 . ఔరంగాబాద్, 6.  భివాండీ

వెస్ట్ బెంగాల్  
1. కలకత్తా,  2.  దుర్గాపూర్ 3. హల్దియా, 4. హాబ్రా, 5. జాంగీపూర్

గుజరాత్
1. అహ్మదాబాద్, 2. సూరత్, 3. వడోదర, 4. రాజ్కోట్, 5. భావ్నగర్, 6. జునాగఢ్, 7. మహాత్మా గాంధీ నగర్

మధ్య ప్రదేశ్
1. భూపాల్, 2. ఇండోర్, 3. గౌలియార్, 4. బురహన్పూర్లలో, 5. జబల్పూర్

తమిళనాడు
1. చెన్నై, 2. కోయంబత్తూర్, 3. మధురై, 4. తిరుచిరాపల్లి, 5. సేలం, 6. తిరునల్వేలి

కర్నాటక
1. బెంగుళూర్, 2. గుల్బర్గా, 3. బీదర్, 4. బీజాపూర్, 5. బాదామి, 6. పట్టడకాల్, 7. మహాకుట

కేరళ
1. తిరువంతపురం, 2. కొల్లాం, 3. కొట్టాయం, 4. తిరువల్ల, 5. ఎర్నాకులం, 6. కొచ్చిన్, 7. త్రిస్సూర్

తెలంగాణ
1. హైదరాబాద్, 2. వరంగల్, 3. కరీంనగర్, 4. నిజామాబాద్, 5. నల్గొండ

ఆంధ్ర ప్రదేశ్
1. గుంటూరు, 2. విజయవాడ, 3. కర్నూలు, 4. చిత్తూరు

ఉత్తర ప్రదేశ్
1. కాన్పూర్, 2. అలహాబాద్, 3. లక్నో, 4. ఝాన్సీ, 5. ఫైజాబాద్, 6. వారణాసి

రాజస్థాన్
1. జైపూర్, 2. అజ్మీర్, 3. భరత్పూర్, 4. బికానెర్, 5. జోధాపూర్, 6. కోటా, 7. వుడిపూర్

పంజాబ్
1. లుధియానా, 2. అమృత్సర్, 3. జలంధర్, 4. పాటియాలా

బీహార్
1. ముజాఫర్పూర్, 2. పాట్నా, 3. గయా, 4  భాగల్పూర్, 5. బీహార్ షరీఫ్

హర్యానా
1. ఫరీదాబాద్, 2. గూర్గావ్, 3 పానిపట్, 4. అంబాలా

అస్సాం
1  గౌహతి, 2. తిన్సుకియా, 3. ఒడల్గురి, 4. టాంగ్లా, 5. గోల్పర

ఒడిషా
1. భువనేశ్వర్, 2. కటక్, 3  రూర్కెలా, 4  సంబల్పూర్, 5. బాలాసోర్

హిమాచల్ ప్రదేశ్
1. సిమ్లా

ఉత్తరాఖండ్
1  హరిద్వార్, 2. రూర్కీ 3. డెహ్రడన్,

జార్ఖండ్
1. జంషెడ్పూర్, 2. ధన్బాద్, 3. రాంచీ

సిక్కిం
1. గాంగ్టక్, 2. పెల్లింగ్ 3. యుక్సమ్

మణిపూర్
1. బిష్ణుపూర్, 2. చందేల్

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central government  smart cities  telugu states  venkaiah naidu  

Other Articles