Varalakshmi | Varalakshmi Vratam | Pooja | Godess

Varalakshmi puja day is one of the significant days to worship the goddess of wealth and prosperity

Varalakshmi, Varalakshmi Vratam, Pooja, Godess, lakshmi, Wealth

Varalakshmi Puja day is one of the significant days to worship the goddess of wealth and prosperity. Varalakshmi, who is the consort of Lord Vishnu, is one of the forms of Goddess Mahalakshmi. Varalakshmi was incarnated from the milky ocean, popularly known as Kshir Sagar. She is described as having the complexion of milky ocean and adorns similar color clothes.

వరలక్ష్మి వ్రతంతో అమ్మవారి అనుగ్రహం పొందండి

Posted: 08/27/2015 04:39 PM IST
Varalakshmi puja day is one of the significant days to worship the goddess of wealth and prosperity

రాష్ట్రవ్యాప్తంగా పండుగశోభ సంతరించుకుంది. శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున మహిళలు భక్తిశ్రద్దలతో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారు. శ్రావణమాసం వచ్చేసింది. నెలంతా పండుగ శోభ సంతరించుకునే ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతానిది ప్రత్యేక స్థానం. అయితే అష్టైశ్వర్యాలు.. సకల సౌభాగ్యం.. సిరి సంపదలు.. ఒక్కటేంటి కోరిన కోర్కెలను తీర్చే కల్ప వృక్షంలా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

ఈ రోజు ఎప్పుడు పూజ చెయ్యాలి..
సింహలగ్న పూజా ముహూర్తం.. ఉదయం 6గంటల 4నిమిషాల నుండి 7గంటల 26 నిమిషాల వరకు(దాదాపు గంట 20 నిమిషాలు)
వృశ్చిక లగ్న పూజా ముహూర్తం... ఉదయం 11గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట 55 నిమిషాల వరకు(2గంట 13 నిమిషాలు)
కుంభలగ్న పూజా ముహూర్తం.. సాయంత్రం 5గంటల 52 నిమిషాల నుండి 7గంటల 30 నిమిషాల వరకు (1గంట 38 నిమిషాలు)
వృషభ లగ్న పూజా ముహూర్తం.. రాత్రి 10 గంటల 51 నిమిషాల నుండి అర్దరాత్రి దాటిని తర్వాత 51 నిమిషాల వరకు (దాదాపు రెండు గంటలు)

సిరులు కురిపించే వరలక్ష్మి....
సకలసంపదలను కురిపించే లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి, సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా, అష్టమూర్తులుగా భావించి అందరూ పూజిస్తారు. సంపదకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, తుష్టికి, పుష్టికి, యశస్సులకు మూలకారణంగా సర్వులచేతఆ తల్లియే పూజించబడుతోంది. ఈ తల్లినే ప్రతిఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్ల్మీగా భావించి పూజిస్తున్నాం. శ్రవణ నక్షత్రం పౌర్ణమినాడు ఉన్న మాసమే శ్రావణమాసము. ఈమాసంలో ఆ తల్లిని పూజిస్తే సర్వసౌభాగ్యాలు కలుగుతాయని స్వయంగా శివుడు పార్వతిదేవికి చెప్పాడట. ‘‘ధవళతరాంశుక గంధమూల్య శోభే’’అంటూ వరలక్ష్మీదేవికి ఇష్టమైన శ్వేత వస్త్రాలని కట్టి, శ్వేత వర్ణ పుష్పాలతో, శ్వేతశ్రీ గంధంతో, పాలు, పాయసంతో, అధికంగా తెలుపు రంగుకు ప్రాధాన్యతనిస్తూ ఈ వ్రతాన్ని స్ర్తిలంతా అత్యంత ఉత్సాహంతో జరుపుతారు. మంగళప్రదయైన ఆ తల్లి తనను కొలిచిన వారికి కొంగుబంగారం అవుతుంది. ఇహలోక సంపదలతో పాటుగాపరలోక ఐశ్వర్యాలను కూడా కలిగించే ఈ తల్లిని ఈ మాసంలో కొలవడానికో ప్రత్యేకత ఉంది.

పూర్వం మగధ దేశంలో ‘కుండిన’ అనే పట్టణంలో సకల శాస్త్రాలు పఠించిన ప్రతిభావంతురాలైన చారుమతీదేవి అనే పుణ్యస్ర్తికి శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి స్వప్నంలో కనబడి ‘‘వరలక్ష్మీ వ్రతం’’ ఆచరించమని ఆదేశించింది. ఆ చారుమతి వరలక్ష్మీదేవి ఆదేశానుసారంగా శ్రావణ పౌర్ణమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు తోటి బంధువులతో విధి విధానంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించింది.

 ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫల, భక్ష్య భోజ్యాలను నివేదన చేసింది. ఆ తర్వాత చారుమతి శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించిన పురోహితునికి దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరిచింది. ఇలా పుణ్యస్ర్తి అయిన చారుమతి ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి లోకానికి అందించిన శ్రీ వరలక్ష్మీవ్రతాన్ని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు తెలియజేశాడు. ఆనాటి నుంచి సర్వులూ ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించి శుభఫలితాలను పొందుతున్నారు. ఈ వ్రతం ఆచరించడానికి చిన్నపెద్ద, కులగ్రోతాలు లాంటి ఏవీ అడ్డుకావు.

ఎవరైనా తల్లిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆనందంగా కొలవచ్చు. ఈ వ్రతంలో ‘తోరపూజ’అతి ప్రధానమైనది. తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడుల్ని వేసి పుష్పాల్ని మధ్య మధ్యలో కట్టిన సూత్రాన్ని కుడిచేతికి కట్టుకొని ‘అమ్మా! వరలక్ష్మీదేవి! నాకు పుత్ర పౌత్రాభివృద్ధినీ, ఆరోగ్యంతో కూడిన ఆయుష్షును ఇవ్వవలసిందిగా’ ప్రార్థించాలి.

ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించినచో స్ర్తిలకు సకల సౌభాగ్యాలతో పాటు సకల సంపదలు, సుమంగళిగా దీర్ఘాయువు కలుగుతుందని సూత మహర్షి శౌనకాదులకు వివరించి ఉన్నాడు. ఈ వ్రతాచరణకు ముందు ఇల్లు వాకిళ్లను శుభ్రపరిచి మామిడితోరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. కొంతమంది బంగారంతోనో, లేక వెండితోనూ అమ్మముఖరూపు కొబ్బరి కాయకు పెట్టి అమ్మవారిని అర్చిస్తారు. మరికొందరు టెంకాయనే తల్లిగా భావించి పసుపురాసి కన్నులు, ముక్కు, నోరు, చెవులను దిద్ది కొత్తచీరకట్టి జడవేసి పూలు పెట్టి తమకున్న ఆభరణాలు అలంకరించి అమ్మవారికి ప్రాణప్రతిష్ట చేసి ఆరాధిస్తారు.

అష్టోత్తర శతనామావళులతో అమ్మను పూజించి వ్రతకథను చదివి అక్షింతలు వేసుకొంటారు. మంగళకరమైన పాటలు పాడి నృత్యాలు చేసి అమ్మను సంతోషింపచేస్తారు. సాయంత్రం వేళ దీపారాధన చేసి ఇరుగుపొరుగులను పిలిచి వారిని అమ్మవారి ప్రతిరూపంగా తలిచి పండు తాంబూలాలు శనగలు ఇచ్చి సంతోషపడ్తారు. అమ్మను పూజించడం వల్ల చంద్రానుగ్రహం, వైకుంఠుడు సాయుజ్జ్యం కూడా కలుగుతుంది. వసుధైక కుంటుబ ఆవశ్యకతను తెలిపే ఈ పండుగను అందరూ ఆచరించి అమ్మ అనుగ్రహం పొందాలి.

మీకు, మీ కుటుంబ సభ్యలకు అమ్మ వారు అన్ని అనుగ్రహించాలని.. సిరి సంపదలతో కలకాలం సుఖశాంతులతో ఉండాలని తెలుగు విశేష్ తరఫున మనసారా కోరుకుంటున్నాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varalakshmi  Varalakshmi Vratam  Pooja  Godess  lakshmi  Wealth  

Other Articles