district legal cell judge lashes out at ANU prinicpal baburao

Bail petition of rishiteswari suicide case accused adjourned to august 10th

district judge, legal cell court, babu rao, Nagarjuna University, rishiteswari sucide note discloses few more details, Rishiteswari sucide case, students in guntur protest dharna, MP kavitha, MP Rapolu anand bhasker, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy,

guntur legal cell adjourned bail petition of accused in rishiteswari suicide case to august 10th

రిషితేశ్వరి కేసు: పిల్లలతో కలసి డ్యాన్సులా..? ప్రిన్సిపాల్ పై మండిపడిన న్యాయమూర్తి

Posted: 08/07/2015 07:35 PM IST
Bail petition of rishiteswari suicide case accused adjourned to august 10th

నాగార్జునా విశ్వవిద్యాలయం బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై కోర్టులో వాదోపవాదాలు, ఆరోపణలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ర్యాగింగ్‌తో ముడిపడిన ఈ కేసులో తన కుమార్తెను కావాలనే ఇరికించారని, కుట్ర జరిగిందని నిందితురాలు అనీషా తండ్రి దామోదర్ గుప్తా ఆరోపించారు. ఈ కేసులో నిందితులు చరణ్, శ్రీనివాస్, అనీషా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈ ఉదయం నుంచీ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. తీర్పు ఈనెల 10వ తేదీకి వాయిదాపడింది.

మరోవైపు ఇదే కేసులో జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ సుమోటోగా చేపట్టిన కేసును కోట్టివేసింది. నాగార్జునా యూనివర్సటీ రిజిస్ట్రార్.. ప్రిన్సిపాల్ బాబురావుపై పిర్యాదు చేయగా కేసును నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుమోటో కేసును కోట్టివేసి.. రిజిస్ట్రార్ కేసుపై విచరారణను చేపట్టింది. కాగా ఇవాళ విచారణ నిమిత్తం జిల్లా లీగల్ సెట్ ఎదుట హాజరైన ప్రిన్సిపాల్‌ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పిల్లలతో ప్రిన్సిపాల్ డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య  అని బాబూరావు వైఖరిని తప్పుబట్టారు. ఇంత జరిగినా కనీసం మీలో పశ్చాత్తాపం కనబడుటం లేదు. కనీసం  మీ నాన్నకు నీవైనా చెప్పంటూ పక్కనున్న ప్రిన్సిపాల్ కొడుకును చూస్తూ జడ్జి వ్యాఖ్యానించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : district judge  legal cell court  babu rao  Nagarjuna University  

Other Articles