తెలంగాణ ఎక్సైజ్ అధికారులు రూపొందించిన సరికొత్త మద్యం పాలసీకీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమోదం లభించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అటు గుడుంబా, ఇటు బెల్ట్ షాపులను అరికట్టడంతోపాటు, ఖజానాకు భారీగా కాసుల కురిపించే కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. అయితే అధిక ఆదాయాన్ని రాబట్టే హైదరాబాద్ లో మరో నూతన పాలసీని అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపిందని సమాచారం. సాధరణంగా దసరా పండగ ముందు నుంచి నూతన పాలసీ అమల్లోకి రావడం అనవాయితీగా మారింది.
అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతున్న కొత్త మద్యం పాలసీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమోదం లభించింది. ఈ మేరకు ఆయన ఇవాళ నూతన మద్యం పాలసీపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన మద్యం పాలసీకి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పాలసీలో గుడుంబా నిర్మూలన, బెల్టు పాఫులు లేకుండా చేయడమే ప్రధాన ధ్యేయంగా ఉంటుందని ఆయన వివరించారు. నెలాఖరులోగా మద్యం దుకాణాలకు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
చీప్ లిక్కర్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలోనే ఆల్కహాల్ పర్సంటేజీపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ కొత్త మద్యం పాలసీతో రాష్ట్ర ఖజానాకు అదాయం తగ్గినా.. పర్వాలేదు కానీ, ప్రజల ఆరోగ్యానికి మాత్రం భద్రత కల్పించేలా ఉంటుందన్నారు. మండలాన్ని యూనిట్ గా చేసి చీఫ్ లిక్కర్ లైస్సెన్సులు జారీ చేస్తామని కేసీఆర్ చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more