special pmla court issues non bailable arrest warrant against former lalit modi

Non bailable arrest warrant issued against lalit modi

United Kingdom, UN Court, Mumbai court, Lalit Modi, IPL, Indian Premier League, Congress, Special judge P R Bhavake, court reserves, ED, Enforcement Directorate, IPL, Lalit Modi, non-bailable warrant, Plea, Warrant, Special PMLA court, non-bailable arrest warrant, Lalit Modi

A Mumbai court on Wednesday issued a non-bailable arrest warrant against former IPL chairman Lalit Modi in a case of alleged money laundering registered against him.

లలిత్ మోడీపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ

Posted: 08/05/2015 12:45 PM IST
Non bailable arrest warrant issued against lalit modi

కాసుల వర్షం, కనకవర్షం కురింపించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిధుల మళ్లింపు, దుర్వినియోగం కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్ లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట: ఈఢీ అధికారుల విన్నపం మేరకు బుధవాంర ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం వారెంట్ ను జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధర చట్టం కింద నమోదైన కేసుపై విచారణ చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి ఆర్ భవకే.. లలిత్ మోడీపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఇప్పుడు ఈ తాజా నాన్ బెయిలేబుల్ వారెంట్ ను ఇప్పుడు భారత ఈడీ అధికారులు లండన్ హోం మంత్రిత్వ శాఖకు పంపనున్నారని సమాచారం.

ఐపీఎల్ వ్యవస్థాప కమిషనర్ గా పనిచేసిన లలిత్ మోదీ.. అదే సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోడీపై కేసు నమోదు చేసింది. కాగా ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం, కేసులు నమోదు కావడంత మోదీ లండన్ లో పారిపోయి తలదాచుకున్నారు. 2010 నుంచి మోదీ లండన్ లోనే ఉంటున్నారు. విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ అధికారులు సమన్తు పంపినా హాజరు కాలేదు. తనకు భారత్ లో ప్రాణభయం వుందని పేర్కోంటూ విచాణను తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం లలిత్ మోదీపై నాన్ బెయలెబుల్ వారెంట్ జారీ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Special PMLA court  non-bailable arrest warrant  Lalit Modi  

Other Articles