modi | mann ki Baat | Ads

Centre spent rs 8 5 crore on newspaper ads for pm modis mann ki baat

modi, mann ki Baat, Narendra Modi, Central Govt, Publisity, Adds, ASdvertisments

Centre spent Rs 8.5 crore on newspaper ads for PM Modis Mann Ki Baat The Union government spent Rs 8.5 crore advertising Mann Ki Baat, PM Narendra Modi’s monthly radio address to the nation, an RTI reply by the Ministry of Information and Broadcasting reveals.

మనసులో మాట చెప్పడానికి 8.5కోట్ల ఖర్చు..!

Posted: 08/05/2015 12:12 PM IST
Centre spent rs 8 5 crore on newspaper ads for pm modis mann ki baat

తప్పులెంచక ముందు తన తప్పులెరుగు మోదీ అంటూ ఆప్ కార్యకర్త తలంటుతున్నారు. అయినా మాట్లాడటానికి ఏకంగా 8.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా మోదీ గారు అంటేనే బిల్డప్ మరి అలాంటప్పుడు ఆ మాత్రం ఖర్చు ఉండదా అని మోదీ గారిని వెనకేసుకువచ్చే వారు కూడా ఉన్నారు. గత జులై చివరి ఆదివారం నాడు మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కోసం ప్రభుత్వం ఎంతో విసృతంగా ప్రచారం చేసింది. ఎంతలా ప్రచారం చేసిందంటే ప్రభుత్వం చేసిన ఖర్చు తెలిస్తే కళ్లు తిరేగేంతలా ఖర్చు చేసింది. అయినా అంత ఖర్చు చేసి ప్రచారం అవసరమా అని ప్రపతిపక్షాలు నెత్తినోరు కొట్టుకుంటున్నా మోదీ మాత్రం బెల్లంకొట్టిన రాయిగా మిన్నకుండిపోతున్నారు.

జులై 29న ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రోడ్ల ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం రోడ్డు భద్రత మీద కొత్త బిల్లును తీసుకువస్తుందని వెల్లడించారు. ఇదంతా బాగానే ఉంది.. కానీ మోదీ గారి మన్ కీ బాత్ ప్రచారం వెనక చేసిన ప్రచారం చూస్తేనే కళ్లుతేరేస్తున్నారు. ఓ ఆప్ కార్యకర్త ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ప్రచారం కోసం చేసిన ఖర్చు మీద సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించారు. అందులో ప్రభుత్వం చేసిన ఖర్చును చూసిన పిటిషనర్ అవాక్కయ్యారు. ఇంతకీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?  8,54,74,783రూపాయలు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం ఎనిమిది కోట్ల యాభైలనాలుగు లక్షలపైచిలుకు ఖర్చు చేశారు. అయితే ఢిల్లీలో ఆప్ ప్రచారం చేస్తున్న ఖర్చు మీద తీవ్రంగా మండిపడుతున్న బిజెపికి తమ ఖర్చు మాత్రం కనిపించడం లేదా అని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా మోదీనా మజాకా....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  mann ki Baat  Narendra Modi  Central Govt  Publisity  Adds  ASdvertisments  

Other Articles