Cash for vote | Ramjatmalani | Tapping | AP | Telangana, Chandrababu Naidu

High court will announce the judgement on cash for vote case in telangana

Cash for vote, Ramjatmalani, Tapping, AP, Telangana, Chandrababu Naidu

High court will announce the judgement on Cash for vote case in telangana. RamJatmalani arrgue in High court.

ITEMVIDEOS: ఓటుకు నోటుపై నాలుగు గంటలకు తీర్పు

Posted: 07/30/2015 03:34 PM IST
High court will announce the judgement on cash for vote case in telangana

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఓటుకు నోటు వ్యవహారం కోర్టులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించిన ఏపి సర్కార్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చారు రాంజెఠ్మలాని. రాంజెఠ్మలాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తన వాదనలు వివరిస్తు తెంలగాణ ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడింది అని స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు ఇవ్వనుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉందని వాదించారు రాంజెఠ్మలాని. ఓటుకు నోటు కేసు నమోదైన తర్వాతే తెలంగాణ సర్కారు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందన్నారు రాంజెఠ్మలానీ. సర్వీస్‌ ప్రొవైడర్లకు హోంశాఖ కార్యదర్శి నుంచి లేఖలు రాశామని టీ ప్రభుత్వ లాయర్‌ కోర్టుకు తెలిపారు. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం సరికాదన్నారు ఏపీ తరఫున వాదించిన అదనపు సొలిసెటర్‌ జనరల్‌ నటరాజన్‌. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడే, అసాంఘిక శక్తుల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేయవచ్చని… దీనికి రాష్ట్ర, కేంద్ర హోంశాఖ కార్యదర్శుల అనుమతి ఉండాలన్నారు నటరాజన్‌.

Also Read:  ఫోన్ ట్యాపింగ్ కేసు ముందకా..? వెనక్కా..?

సాయంత్రం నాలుగు గంటలకు ఓటుకు నోటు వ్యవహారం మీద కోర్టు తీర్పును వెల్లడించనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం పై కోర్టులో వాదనలు ముగిశాయి. ఇప్పటికే 39 మంది సాక్షులను విచారించిన తెలంగాణ ఏసీబీ, రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురి మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మాత్రం చార్జ్ షీట్ లో నమోదు చెయ్యలేదు. అయితే సండ్ర పేరుతో సపరేట్ గా ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు సమాచారం. మరి తెలంగాణ, ఏపిల మధ్య సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఓటుకు నోటు వ్యవహారం పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read:  కాల్ డేటా ఇవ్వని సర్వీసు సంస్థలపై కేసులు నమోదు చేయండి
Also Read:  ‘ఫోన్ ట్యాపింగ్’లో అడ్డంగా బుక్కైన కేసీఆర్..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cash for vote  Ramjatmalani  Tapping  AP  Telangana  Chandrababu Naidu  

Other Articles