Telangana Cm Kcr Trapped In Phone Tapping Controversy | Peetala Sujatha | Jupudi

Telangana cm kcr trapped in phone tapping controversy peetala sujatha

cm kcr, phone tapping, tapping controversy, peetala sujatha, cash for vote, note for vote, chandrababu naidu, ap govt, telangana govt, revanth reddy, revanth controversy, revanth arrest, ap service providers

Telangana Cm Kcr Trapped In Phone Tapping Controversy Peetala Sujatha : Ap minister peetala sujatha says some interesting comments on cm kcr and phone tapping controversy.

‘ఫోన్ ట్యాపింగ్’లో అడ్డంగా బుక్కైన కేసీఆర్..?

Posted: 07/27/2015 01:58 PM IST
Telangana cm kcr trapped in phone tapping controversy peetala sujatha

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ‘ఫోన్ ట్యాపింగ్’ని తెరమీదకొచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు విడుదల కావడంతో కొన్నాళ్లపాటు ఈ ట్యాపింగ్ వ్యవహారం గోలగోలగా సాగింది. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ.. ఒక్కసారిగా ఆ ఉద్రిక్త వాతావరణం చల్లబడింది. అటు రేవంత్ విడుదల కాగా.. ఇటు ట్యాపింగ్ రిజల్ట్ ఏమాత్రం తెలియరాలేదు. కానీ.. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డంగా బుక్కైనట్లు ప్రచారాలు మాత్రం కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను లోబర్చుకోవడానికి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. టీడీపీపై నిఘా పెట్టింది. అనంతరం రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం జరిగింది. కాగా.. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్వీస్ ప్రొవైడర్లకు టీడీపీ కదలికల గురించి తెలియజేయాలని అఫీషియల్ గా గతంలోనే లెటర్ రాసింది. కానీ.. తాము అలా చేయించలేదని కేసీఆర్, ఆయన ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అటు టీడీపీ ప్రభుత్వం ఈ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జోరుగా కొనసాగిస్తోంది. ఒకవేళ ‘ఫోన్ ట్యాపింగ్’ చేయించింది తెలంగాణ ప్రభుత్వమేనని తేలితే.. కేసీఆర్ ఇరకాటంలో పడినట్లేనని సమాచారం.

peethala-sujatha-pm-image

ఇదిలావుండగా.. ఈ ‘ఫోన్ ట్యాపింగ్’పై టీడీపీ నేతలు సీఎం కేసీఆర్ మీద మాటల తూటాలు పేల్చుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించగా.. తాజాగా ఏపీ మంత్రి పీతల సుజాత ఫైరయ్యారు. ‘ఓటుకు నోటు’ పేరిట తమ పార్టీతోపాటు, చంద్రబాబుని ఇరుకునపెట్టేందుకు యత్నించిన కేసీఆర్.. తాను ఉచ్చులో చిక్కుకుని అడ్డంగా బుక్కయ్యారని ఆమె ఆరోపించారు. తాము ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయలేదన్న కేసీఆర్ మాటలు.. సుప్రీంకోర్టులో సర్వీస్ ప్రొవైడర్ల వాదనతో వీటిపోయాయని ఆమె చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  phone tapping  tapping controversy  peetala sujatha  

Other Articles