Rahul Gandhi tells PM Narendra Modi to speak up on lalit gate and vyapam scam

Why is modi silent on vyapam asks rahul gandhi

Rahul Gandhi tells PM Narendra Modi to speak up on lalit gate and vyapam scam, Rahul Gandhi, Vyapam scam, Narendra Modi, Parliament. lalit modi, sushma swaraj, minister of external affairs sushma swaraj, vasundara raje, shivraj singh chauhan, madyapradesh, rajasthan chief minister raje, lalit visa row

More than 40 people have died in the Vyapam scam. One of your friends has also died. This is such a big scam and the PM is silent on this," Gandhi told reporters outside Parliament.

ప్రధానిపై సూటిగా ప్రశ్నలవర్షం కురిపించిన యువరాజు..!

Posted: 07/23/2015 03:26 PM IST
Why is modi silent on vyapam asks rahul gandhi

ప్రధానిపై ప్రశ్నలవర్షం కురిపించిన యువరాజా వారు..! ఈ శీర్షిక చూడగానే ఇంతకీ ఎవరా ప్రధాని, ఏమా యువరాజు కథ.. అనుకుంటున్నారా..మన ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ డెరెక్టుగా అటాక్ చేశారు. అది కూడా ఏదో మీడియా సమావేశంలో కాదు. ఏకంగా పార్లమెంటు సమవేశాల్లో.. ప్రధాని మోడీగారు.. ఎన్నికల ముందు మీలో వున్న ఆ సత్తా, చురుకుదనం ఏమైందంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను మౌన్ మోహన్ సింగ్ అంటూ ఎద్దేవా చేసిన.. మీరు.. ఇప్పుడు అదే మౌనాన్ని ఎందుకు అవలంభిస్తున్నారని నిలదీశారు.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అవినీతి లేని పరిపాలనను అందిస్తామన్న నరేంద్రమోడీ ప్రభుత్వం.. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినా.. ప్రధాని మౌనాన్ని వీడటం లేదని విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. మౌనం వీడి సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్,  లలిత్ మోదీకి సహకరించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కుంభకోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న 40 మందికిపైగా మరణిస్తే.. దానిపై ప్రధాని ఒక్క మాటా కూడా మాట్లడకుండా మౌనం వహించిడం దురదృష్టకరమన్నారు.

గత సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు నరేంద్రమోడీపై నున్న అచెంచల విశ్వాసం.. నమ్మకం అయనను, ఆయన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిందన్న రాహుల్ గాంధీ, తమ నమ్మకాలు, విశ్వాసాలు సడలిపోవడంపై ప్రజలు దిగులు చెందుతున్నారని ఆయన పేర్కోన్నారు. నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధానినన్న విషయాన్ని మర్చిపోయి కేవలం బిజేపి పార్టీకే ప్రధానిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈ కుంభకోణాలపై ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Vyapam scam  Narendra Modi  Parliament  

Other Articles