Parliament | Hyderabad | Section 8 | KCR, Telangana, Ap

Telangana cm kcr got shock on section 8 ijn hyderabad

Parliament, Hyderabad, Section 8, KCR, Telangana, Ap

Telangana Cm KCR got shock on section 8 ijn hyderabad. Central Minister Kiran Rijuja said that Govarnor has special duties on behalf of Hyderbad. Kiran rijuja answer a question about the Hyderbad in the Parliament.

సెక్షన్ 8 పై కేసిఆర్ కు షాక్.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడి

Posted: 07/23/2015 04:11 PM IST
Telangana cm kcr got shock on section 8 ijn hyderabad

ఓటుకు నోటు, ట్యాపింగ్ ఆ తర్వాత సెక్షన్ 8 ఇది తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిణామ క్రమం. దేని తర్వాత ఏది వచ్చింది అన్నది పక్కనబెడితే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా గవర్నర్ ను, కేంద్ర హోంమంత్రిని, ప్రధానిని కూడా కలిసి సెక్షన్ అమలు చెయ్యాలని రిక్వెస్ట్ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని మీద తీవ్రంగా స్పందించారు. ఏపి ప్రభుత్వం వాదనలొ అసలు ఎలాంటి పస లేదని అంటొంది. విభజన సమయంలో ఏపి ప్రజల మనోభావాలను దెబ్బతియ్య కూడదనే ఉద్దేశంతో సెక్షన్ 8 ను తెర మీదకు తీసుకువచ్చారు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని అంటోంది. అయితే తాజాగా పార్లమెంట్ సాక్షిగా సెక్షన్ 8 మీద కేసీఆర్ కు షాక్ ఇచ్చారు.

Also Read:  సెక్షన్ 8 కుదరకపోతే హైదరాబాద్ ను యుటి చెయ్యాల్సిందే

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు  సెక్షన్ 8 మీద ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టం సెక్షన్‌ 8(1) ప్రకారం పరిపాలనా ఉద్దేశ్యంతో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అయింది. ఈ ప్రాంతంలో నివశించే పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల రక్షణకు గాను గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు కల్పించాము అని ఆ సమాధానంలో తెలిపారు. అయితే, కేంద్రం మరో ఆసక్తికరమైన కామెంట్ కూడా చేసింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో పౌరుల రక్షణ, ఆస్తులకు సంబంధించి ఎలాంటి సమస్యలూ ఏర్పడలేదని వివరించింది. అంతేకాదు.. విభజన సందర్భంలో జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకూ ఆస్తుల పంపిణీ చేయడం వల్ల ఏపీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్‌ చౌధురి.. రాజ్యసభలో హామీ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ లోని శాంతి భద్రతలు, తదితర అంశాలపై గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని వెల్లడించడం.. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఎలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోలేదు అని వెల్లడించడం విశేషం.  మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా సెక్షన్ 8 మీద కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలిందనే చెప్పాలి.

Also Read:  సెక్షన్ 8 అమలుపై కేసీఆర్ చెక్.. గవర్నర్ కు హెచ్చరిక

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  Hyderabad  Section 8  KCR  Telangana  Ap  

Other Articles