Chandrababu naidu | Rajahmundry | Godavari Pushkaralu

National media questions the chandrababu naidu and his govt for rajahmundry tragedy

Chandrababu naidu, Rajahmundry, Godavari Pushkaralu

National Media questions the Chandrababu naidu and his govt for Rajahmundry tragedy. In Times now channel arnab goswamy attacked on chandrababu govt.

ITEMVIDEOS: జాతీయ మీడియా చంద్రబాబును ఉతికేసింది

Posted: 07/18/2015 11:08 AM IST
National media questions the chandrababu naidu and his govt for rajahmundry tragedy

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద మరోసారి జాతీయ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రముఖ ఛానల్ టైమ్స్ నౌ లో అర్నాబ్ గోస్వామి చంద్రబాబు నాయుడు మీద, టిడిపి పార్టీ మీద విమర్శలు గుప్పించారు.  గోదావరి మహా పుష్కరాలకు ఎంతలా ఏర్పాట్లు చేసినా కానీ ప్రజలకు కనీస భద్రత ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వం ఎంత చేసినా ఏంటి లాభం అని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. అయితే వివిఐపి ఘాట్ లో కాకుండా సాధారణ ప్రజలు ఉండే ఘాట్ లోకి రావడం వల్ల అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని.. దాదాపు మూడు గంట పాటు ఘాట్ లో ఉండటం.. సాధారణ ప్రజలను లోపలికి అనుమతించకపోవడం వల్ల చివరకు తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు నాయుడు మీద ఎద్దేవా చేశారు.

Also Read:  చంద్రబాబు షూటింగ్ వల్లే అంతమంది చనిపోయారు

చంద్రబాబు నాయుడుతో పాటు ఏపి ప్రభుత్వానికి చెందిన మంత్రులు, పలువురు అధికారులు, మీడియా సిబ్బంది ఒక్కసారి ఘాట్ లోకి రావడంతో పోలీసులు మామూలు ప్రజలను ఎవరినీ అనుమతించలేదని.. దీన్ని ప్రశ్నించారు. అయితే గతంలో జరిగిన హుద్ హుద్ తుఫాన్ సమయంలో ఏపి ప్రభుత్వం ఎంతో వేగంగా స్పందించిందని..సిఎం రమేష్ చెప్పుకొచ్చినా కానీ రాజమండ్రి దర్ఘటన జరగకుండా మాత్రం ఎలాంటి చర్యలకు దిగలేదని ప్రశ్నించారు. 30 మంది భక్తుల ప్రాణాలు తీసిన ఈ నేరానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆర్ణబ్ గోస్వామి ఆంధ్రా మంత్రులపై రంకెలేశాడు. మామూలుగానే ఆర్ణబ్ అరుపులు తట్టుకోలేం. ఇక ఇలాంటి సీరియస్ అంశంలో వదిలిపెడతాడా.. పాపం.. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ నానా తంటాలు పడ్డారు. నీళ్లు నమిలారు.

Also Read:  చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!

రాజమండ్రి దుర్ఘటన మీద చంద్రబాబు నాయుడు మీద ప్రశ్నలు ఇవే..
*ఫస్ట్ ముఖ్యమంత్రే పుష్కర స్నానం చెయ్యాలని ఎక్కడైనా ఉందా..?
*6.26లకు వచ్చిన చంద్రబాబు నాయుడు 8.20 దాకా దాదాపు మూడు గంటలు ఉండటం మిగిలిర భక్తులకు ఇబ్బంది కాదా..?
*ఎంతో మంది పడిగాపులు కాస్తుంటే చంద్రబాబు నాయుడు ఇలా చెయ్యడం ఏంటి
*భక్తులు చనిపోతుంటే చంద్రబాబు నాయుడు షూటింగ్ లో ఉండటం కరెక్టేనా..?
*దుర్ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు కంట్రోల్ రూంలో కూర్చుంటే జరిగిన దారుణం చెరిగిపోతుందా..?
* 8.30కు గేట్లు ఎత్తడం వల్లే భక్తులు ఒక్కసారిగా వచ్చారని దాంతో దుర్ఘటన జరిగిందని కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ మీద చర్చ జరిగింది. అయితే అది సాక్షి మీడియా రిపోర్ట్ అని టిడిపి ఎంపీ సిఎం రమేష్ కొట్టివేశారు.

By Abhinavachary

 

Also Read:  ఏడు కోట్లతో పుష్కరాల మీద డాక్యుమెంటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chandrababu naidu  Rajahmundry  Godavari Pushkaralu  

Other Articles