Godavari Pushkaralu |Rajahmundry | Ap | chandrababu naidu

Pushkaraalu as a documentary with seven crore budget

Godavari Pushkaralu, Rajahmundry, Ap, chandrababu naidu. National geography channel

Pushkaraalu as a documentary with seven crore budget Maha Pushkaraalu, the pride occasion of Telugu states is going to be much bigger now, as the world is going to know about it. Regarding this, AP CM Naidu had contacted National Geographic Channel and said to capture the event at the Rajahmundry ghats in live.

ఏడు కోట్లతో పుష్కరాల మీద డాక్యుమెంటరీ

Posted: 07/18/2015 10:11 AM IST
Pushkaraalu as a documentary with seven crore budget

గోదావరి మహా పుష్కరాలు ఎంతో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 25 వరకు సాగనున్న గోదావరి మహా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి గోదావరి మహా పుష్కరాలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో వైభవంగా పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. అయితే గోదావరి తీరంలో ఎంతో వైభవోపేతంగా సాగుతున్న గోదావరి మహా పుష్కరాలను కెమెరాలో బంధించడానికి చంద్రబాబు వేరే ప్లాన్ వేశారు. ఖర్చు ఎంతైనా గోదావరి పుష్కరాల అనుభూతిని కళ్లకుకట్టేలా పుష్కరాలను డ్యాక్యుమెంటరీ రూపంలో తీయనున్నారు.

Also Read:  దారులన్నీ గోదారికే..

నేషనల్ జియోగ్రఫి ఛానల్ తో డాక్యుమెంటరీ...
గోదావరి మహా పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు వాటిని చరిత్రలో గుర్తుండిపయేలా చెయ్యాలని ప్లాన్ వేశారు. అందులో బాగంగానే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వారి చేత గోదావరి మహా పుష్కరాల మీద డాక్యుమెంటరీ తయారు చేయించడానికి సిద్దమయ్యారు. అయితే ముఖ్యంగా పుష్కరాలు జరుగుతన్న రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట వద్ద నేషనల్ జియోగ్రఫీ ఛానల్ సిబ్బంది దృష్టిసారించింది. అందుకే అక్కడ రాత్రి పూట ఏర్పాటు చేసిన లైటింగ్ లో కొన్ని మార్పులు కూడా చేయించారు చంద్రబాబు నాయుడు. ఛానల్ సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పించడమే కాకుండా వారికి కావాలసిన వసతులు కూడా కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం.

Also Read:  చంద్రబాబు షూటింగ్ వల్లే అంతమంది చనిపోయారు

ఏడు కోట్లతో డాక్యుమెంటరీ..
గోదావరి మహా పుష్కరాలను నేషనల్ జాగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ చెయ్యడానికి ఏపి ప్రభుత్వం ఒప్పించింది. అయితే అందుకు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం విశేషం. అయితే కోట్లకు కోట్ల  రూపాయలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గోదావరి మహా పుష్కరాలను మరిచిపోలేని విధంగా కళ్లముందు కట్టే డాక్యుమెంటరీ కోసం ఏడు కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి అని కొందరు వెనకేసుకు వస్తుంటే.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. అయితే రాజమండ్రి దుర్ఘటన తర్వాత చంద్రాబాబు నాయుడు మీడియాలో ప్రచారం కోసం ఇలా డాక్యుమెంటరీ చేయిస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.

Also Read:  చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!

నేడు, రేపు భక్తజనుల గోదారే..
రంజాన్, ఆదివారం సెలవులతో గోదావరి మహా పుష్కరాలకు తాకిడి పెరిగింది. అటు ఏపిలో, తెలంగాణలో రద్దీ భారీగా పెరగుతొంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుండి భక్తులు గోదావరి మహా పుష్కరాలకు క్యు కట్టారు. రెండు రోజులు వరుస పెట్టి సెలవులు రావడంతో ఈ రెండు రోజులు గోదావరి మహా పుష్కరాలకు మరింత శోభరానుంది. అయితే ఈ రెండు రోజులు పుష్కరాలకు హాజరయ్యే భక్తులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari Pushkaralu  Rajahmundry  Ap  chandrababu naidu  

Other Articles