Even men are not safe in Delhi: Women molested Auto driver

2 women molest male auto driver in delhi

Autorickshaw molestation, Auto driver molested, Delhi auto driver molested, Delhi news, India Authorickshaw driver, Tanzania women Hitija, Inspector Vishuddhanand Jha, Safdarjung Enclave police station, Renu Lalwani, molestation of Arjun Nagar, foreigner Hitija, molestation case, Autorickshaw, driver, Tanzania, Delhi Police

Auto driver Umesh Prasad, 41, alleged that two women forcibly tried to have sex with him on the pretext of paying him.

ITEMVIDEOS: ఆటో డ్రైవర్ పై యువతి ముద్దుల వర్షం.. వాంఛ తీర్చాలంటూ బలవంతం

Posted: 07/17/2015 06:45 PM IST
2 women molest male auto driver in delhi

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, యువతులకే కాదు పురుషుల మానాలకు కూడా కరువయ్యింది. తన శృంగార వాంఛను తీర్చాలని కోరుతూ.. ఓ ఆటోడ్రైవర్‌పై 32 ఏళ్ల మహిళ లైంగికదాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. అంతేకాదు పురుషులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడి ఆ ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లుగానే ఇక్కడ కూడా ఈ మొత్తం సీన్‌ను చిత్రీకరించేందుకు టాంజేనియాకు చెందిన విదేశీ మహిళ కెమెరాతో సిద్ధమైపోయింది. దీంతో బెంబేలెత్తిన సదరు ఆటో డ్రైవర్‌ ఇరువురి నుంచి అతికష్టమ్మీద తప్పించుకుని కాలు విరగోట్టకున్నాడు. అయినా లక్ష్యపెట్టక పోలీసులను ఆశ్రయించాడు.

వివరాలోకి వెళ్తే.. ఉమేష్‌ ప్రసాద్‌(41) ఆటో డ్రైవర్‌. బుధవారం మధ్యాహ్నం సాకేత్‌ ప్రాంతంలో రేణు లల్వాణీ(32) అనే మహిళ 7 కిలో మీటర్ల దూరంలోని అర్జున్‌ నగర్‌కు వెళ్లాలంటూ ఉమేష్‌ ఆటో ఎక్కింది. గమ్య స్థానం చేరుకున్నాక.. తన వద్ద డబ్బులు లేవని, ఫ్లాట్‌ వద్దకు వచ్చి తీసుకెళ్లాలని కోరింది. దీంతో ఉమేష్‌.. ఆమెను అనుసరించాడు. ఫ్లాట్‌లోకి వెళ్లాక.. ఉమేష్ కు తొలుత మంచి నీళ్లు ఇచ్చిన లల్వాణీ లోపలికి ఆహ్వానించి.. ఒక్కసారిగా రూం తలుపులు మూసేసింది. అనంతరం, తన వాంఛను తీర్చాలని అతనిపైబడి ఒత్తిడి చేయడమే కాక, ఉమేష్‌ దుస్తులు చించేసి.. ముద్దుల వర్షం కురిపించింది.

ఈ క్రమంలో మద్యం కూడా ఆఫర్‌ చేసింది. అయితే, వీటన్నింటినీ ఉమేష్‌ తిరస్కరించాడు. ఈలోగా.. ఈ ‘సీన్‌’ను చిత్రీకరించేందుకు టాంజానియా కు చెందిన విదేశీ మహిళ హిట్జియా కెమెరాతో అక్కడ ప్రత్యక్షమైంది. దీంతో ఉమేష్‌ మరింత ఆందోళనకుగురై.. ఇరువురినీ ప్రతిఘటించాడు. దీంతో ఇద్దరు మహిళలూ.. ఏదో చర్చించుకునేందుకు పక్కనే ఉన్న గదిలోకి వెళ్లడంతో ఇదే అదనుగా ఉమేష్‌ పై అంతస్తు నుంచి బాల్కనీలోకి ఒక్క ఉదుటన దూకి.. కాలు విరగోట్టుకున్నాడు. అయినా లక్ష్యపెట్టకుండా ఫ్లాట్ నుంచి బయటపడినందుకు సంతోషపడ్డాడు. తన ఆటోలోకి వెక్కి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. లల్వాణీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె ఫ్లాట్‌లో పరిశీలించగా.. నాలుగు ఆటో డ్రైవింగ్‌ లైసెన్సులు లభించాయి. గతంలోనూ ఆటో డ్రైవర్లపై లల్వాణీ ఇదే తరహా లైంగిక దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కాగా పరారీలో వున్న విదేశీ వనిత హిట్జియా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women  male molestation case  Autorickshaw  driver  Tanzania  Delhi Police  

Other Articles