high court to enquire prathusha after her discharge

High court to examine pratyusha father and uncle

Stepmom, Dad Brutally Tortured Pratyusha, high court, uncle, dad, mothers brother, Just for a Flat, aware doctors, pratyusha health bulletin, pratyusha, aware global hospital, heath bulletin, step mother, chamundeshwari, LB nagar police, human rights commision, severe punishment, Girl rescued, Child Rights Group, Child Rights Protection Commission, Child rauma, Torture

high court examined uncle and aunt, and to enquire her dad and mothers brother on 20th of this month

ప్రత్యూష కేసులో తండ్రి, మేనమామలను హాజరుపర్చండీ..

Posted: 07/17/2015 06:48 PM IST
High court to examine pratyusha father and uncle

మహానగరం హైదరాబాద్ గుండెకాయ వంటి ఎల్బీనరగ్ లో సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన యువతి ప్రత్యూష కేసును ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం విచారించింది. ప్రత్యూషకు జీవన భృతిగా తండ్రి వేతనంలో కొంత భాగం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష సంరక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. ప్రత్యూష కోరుకున్న చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆమెను రెస్క్యూహోంకు తరలింపునకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా రెస్క్యూహోంల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రత్యూషను సవతి తల్లి హింసిస్తుంటే బంధువులు, చుట్టుపక్కల వారు స్పందించక పోవడం దారుణమని వ్యాఖ్యానించింది. ప్రత్యూష కేసును సాధారణ కేసుగానే కాకుండా మానవీయ కోణంలోనూ రాష్ట్రోన్నత న్యాయస్థానం డివిజన్ బెండ్ విచారించింది. ప్రత్యూష పెద్దనాన్నా, పెద్దమ్మలను ఇవాళ న్యాయస్థానం విచారించింది. ప్రత్యూష పేరును వున్న ఆస్తుల వివరాలను న్యాయస్థానం సేకరించింది. ఈ కేసు విచారణలో భాగంగీ ఈ నెల 20న ప్రత్యూష మేనమామ, తండ్రిని కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం పోలీసులను అదేశించింది. దీంతో పాటు ప్రత్యూష ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత అమెను కలుస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pratyusha  aware global hospital  high court  uncle  dad  

Other Articles