maha pushkaralu only river ganga says sri paripoornananda saraswati swami

Paripoornanada clarifies on godavari maha pushkaram

paripoornanada clarifies on godavari maha pushkaram, godavari pushkaralu, godavari pushkaram, sri paripoornananda saraswati swamy, river ganga, maha kumbamela, rajamundru, dharmapuri, Andhrapradesh, Telangana, sri peetam

sri peetam peetadhipathi sri paripoornanada swamy clarifies on godavari maha pushkaram, says only river ganga has maha kumbamela

‘‘గంగానదికి మాత్రమే మహా కుంభమేళ.. గోదావరికి పుష్కరాలే..’’

Posted: 07/12/2015 04:14 PM IST
Paripoornanada clarifies on godavari maha pushkaram

గోదావరి నదికి మహా పుష్కరాలు ఉండవని గంగానదికి మాత్రమే 144 ఏళ్లకు మహా కుంభమేళా వస్తుందని శ్రీపీఠం పిథాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వెల్లడించారు. అధివారం తూర్పగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ పరిపూర్ణానంత సరస్వతి స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ.. సుష్కరాల 12 రోజుల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ గడియాలో స్నానం చేసినా పున్యమేనని తెలిపారు. వేప తైలం (నూనె) రాసుకుని స్నానం ఆచరించాలని ఆయన భక్తులకు సూచించారు. ఇలా చేయడం వల్ల శారీరిక అంటువ్యాదులు సోకకుండా ఉండటంతో పాటు శరీర కాంతి కూడా వస్తుందన్నారు.

పుణ్యస్నానం తర్వాత నదలోకి మట్టి విసరడం పుష్కర సంప్రదాయం కాదని పేర్కొన్నారు. పుష్కరాల పేరుతో బస్సులు, రైళ్లు, విమాన చార్జీలు పెంచి ప్రభుత్వం యాత్రికులపై భారం మోపుతుందని స్వామీజీ అవేదన వ్యక్తం చేశారు. శ్రీ పీఠం తరుపున ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, తెలంగాణలోని ధర్మపురిలో గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు ఉచితంగా ఫుష్కర రైస్ పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు 35 వేల మందికిపైగా ఈ రైస్ అందజేస్తామని పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వెల్లడించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles