Dokka Manikya Vara Prasad to join TDP | Nara Lokesh call

Dokka manikya vara prasad says he is not joining ysrcp

Dokka Manikya Vara Prasad to join TDP, Nara Lokesh calls dokka, Nara Lokesh call to Dokka Manikya Vara Prasad, YSRCP, DP Guntur MP Rayapati Sambasiva Rao, ysrcp spokesman Amabti Rambabu, former chief minister YS Rajasekhar Reddy

Dokka Manikya Vara Prasad, who is once a staunch follower of former minister YS Rajasekhar Reddy and supposed to join YSR Congress, seems to have had change of mind and now mulling over to join incumbent TDP.

డోలాయమానంలో డొక్కా.. వైసీపీలో చేరనని ప్రకటన

Posted: 07/12/2015 03:13 PM IST
Dokka manikya vara prasad says he is not joining ysrcp

రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ది శాఖల మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ డోలాయమానంలో పడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన డొక్కా మాణిక్యవరఫ్రసాద్ ఈ నెల 13న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆయన పార్టీ తీర్ఘం పుచ్చుకోవడానికి రమారమి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా చివరి క్షణంలో తాను వైసీపీలో చేరడం లేదని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే ప్రస్తుతం నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు.

తాను రాజకీయాల్లో పదకొండేళ్ల బాలుడినని, ఇంకా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రాననిపిస్తోందని వేదాంత ధోరణిలో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా అయోమయంగా ఉందని, తాను ఇక రాజకీయాల్లో ఉండకపోవచ్చేమోనని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలకంటే ఎంపీ రాయపాటి సాంబశివరావే ముఖ్యమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో మాణిక్యవరప్రసాద్ టీడీపీలోకి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి మాణిక్యవర ప్రసాద్ రాజకీయ గురువు గుంటూరు పార్లమెంటరీ సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. మాణిక్యవరప్రసాద్‌ వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు తనను విస్మయానికి గురి చేశాయని అన్నారు. వెంటనే ఆయనతో మాట్లాడానని.. తామంతా ఒకేచోట ఉంటామని స్పష్టం చేశారు. వరప్రసాద్‌ని టీడీపీలోకి తీసుకురావాల్సిందిగా సీఎం చంద్రబాబు తనను అడిగారని, ఆయన సేవలు పార్టీకి అవసరంగా సీఎం భావిస్తున్నారని చెప్పారు. టీడీపీలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన నేతల కోరత ఏర్పడిందని, మాణిక్యవరప్రసాద్ చేరికతో మరికొందరు ఎస్సీ నేతలు టీడీపీలో చేరే అవకాశాలు వుంటాయని చంద్రబాబు భావిస్తున్నారని తెలిపారు.

ఇదిలావుండగా, పార్టీ యువనేత నారా లోకేశ్ బాబు డోక్కామాణిక్యవరప్రసాద్ తో ఫోన్ ద్వారా సంభాషించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనను తమ పార్టీలో నారా లోకేష్ అహ్వానించినట్లుగా తెలుస్తుంది. రాయపాటికి పార్టీలో లభించినట్లుగానే తనకు కూడా మంచి గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో త్వరలోనే మాణిక్యవరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dokka Manikya Vara Prasad  TDP  YSRCP  Lokesh  ambati rambabu  

Other Articles