VIDEO: Kruger tour guide attacked by leopard

Leopard attacks guide in kruger park

Leopard attacks guide in Kruger Park, Incredible, moment, safari, guard, ,leopard, tourists, rammed, car, south africa, kruger national park, alpha loop, leopard, mpumalanga, skukuza camp, safari guide, leopard attack, wildlife, tourists, South Africa, Kruger National Park, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, africa, news

Incredible moment British safari guide was saved from leopard savaging his arm by tourists who threw BAGS at it - then rammed it with a car door

ITEMVIDEOS: గైడ్ పై దాడి చేసిన చిరుత

Posted: 07/05/2015 08:54 PM IST
Leopard attacks guide in kruger park

ఆకలి వేసిందో.. లేక ప్రతీ రోజును తమను ఇబ్బంది పెడుతున్నారనుకుందో.. ఆ చిరుత.. ఒక్క ఉదుటున గైడ్ పై దాడి చేసి చేతిని పట్టుకుంది. దాని నుంచి చేతిని విడిపించుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. అదేంటి చిరుతలుండే చోటకు గైడ్ ఎందుకు వెళ్లాడు..? అనుకుంటున్నారా..? ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఇలాంటి ప్రశ్నలు మీ మదిని తొలుస్తున్నాయా..? దక్షిణాప్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఈ ఘటన జరిగింది. ఇక్కడ చిరుతలతో పాటు పలు వన్యమృగాలు, క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.

అయితే ప్రతీరోజు వచ్చే వందల సంఖ్యలోని పర్యాటకులకు వాటిని వాహనాల్లో తీసుకెళ్లి చూపించే విధులను అక్కడి గైడ్ లు చూసుకుంటారు. ఇలానే పర్యాటకులకు చిరుతలను చూపించేందుకు వెళ్లిన గైడ్ తన డ్రైవింగ్ సీటు పక్కనుండే అద్దంలోనుంచి చిరుతను పర్యాటకులకు చూపిస్తూ.. దాని దెగ్గరకు తీసుకెళ్లాడు. అంతే ఒక్కసారిగా అనూహ్యంగా దాడి చేసిన చిరుత గైడ్ చేయిని అదిమి పట్టుకుంది. పర్యాటకులు వారి బ్యాగులతో దానిని కొట్టారు. నానా కష్టాలు పడ్డారు. అప్పుకు కానీ అది టైరు కిందకు వెళ్లడంతో చేతిని వదిలింది.

దీంతో వెంటనే వాహనం అద్దన్ని పైకి ఎక్కించిన గైడ్ కమ్ డ్రైవర్.. మెల్లిగా వాహనాన్ని వెనక్కు నడిపించాడు. అయినా అది వాహనంపైకి ఎక్కి మరీ దాడికి తెగబడింది. అన్ని ప్యాక్ చేసి వుండటంతో.. చేసేది లేక.. వాహనాన్ని వెంబడిందింది. ఈ లోపు అటుగా వచ్చిన మరో కారు దానిని ఓవర్ టేక్ చేసి వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో చిరుత కాస్తా ఆ కారు కింద పడింది. ఇక ఈ వాహనాలు వున్నంత వరకు మానవులు నా నుంచి సేప్ గా వుంటారనుకుందో ఏమో.. ఇక తోక ముడిచి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ తతంగాన్నంతా వేరే కారులోని పర్యాటకులు తమ కెమెరాలో బంధించడంతో ఇప్పుడా వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : safari guide  leopard attack  wildlife  tourists  South Africa  Kruger National Park  

Other Articles