The President | Pranabha Mukharjee | TTDP | Talasani Sinivas Yadav

Telangana tdp leaders complaint on talasani srinivas to the president

The President, Pranabha Mukharjee, TTDP, Talasani Sinivas Yadav, Teegala krishna Reddy, Manchi kishan reddy, Madhavaram krishna rao

Telangana TDP leaders complaint on Talasani Srinivas to the President. TTDp leaders met president in Hyderabad and complaints on Talasani and also about the Teegala krishna Reddy, Manchi kishan reddy, Madhavaram krishna rao.

టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రా..!? తలసానికి గండం

Posted: 07/06/2015 08:02 AM IST
Telangana tdp leaders complaint on talasani srinivas to the president

తెలంగాణ రాష్ట్రం తమ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకొని ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టిందని, దీనిపై స్పీకర్ కు, గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశామని అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అయితే తలసాని శ్రీనివాస్ కు సంబందించిన వివషయాలపై రాష్ట్రపతి ఆరా తీసినట్లు తెలంగాణ టిడిపి నేతలు వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగుదేశం పార్టీ ఎమ్మెల్యేనా..? మరి తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా మంత్రిగా పని చేస్తారు...? అని, పిరాయింపుల కేసు కోర్టులో ఉంది కదా..? అని రాష్ట్రపతి టిటిడిపి నేతలను ప్రశ్నించినట్లు వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లా టిఆర్ఎస్ పార్టీ ఎంత మందిని పార్టీలోకి చేర్చుకుంది అని ఆరా తీశారట.   టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణతోపాటు పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, ఈ.పెద్దిరెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్‌, రాజేందర్‌ రెడ్డి, సాయన్నలతో కూడిని టిటిడిపి బృందం రాష్ట్రపతిని కలిసి తలసాని వ్యవహారంపై ఫిర్యాదు చేసింది.

Also Read : మంత్రి తలసాని వార్నింగ్ పై కోపగించుకున్న కవిత..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టిటిడిపి నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి చదవారని, కొన్ని విషయాలపై ఆరా తీశారని తెలుగుదేశం తెలంగాణ నేతలు వివరించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ మంత్రిగా ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి అడిగారు. దీంతో ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిటర్నింగ్‌ అధికారి తలసానిని టీడీపీ సభ్యుడిగా అధికారిక జాబితాలో పేర్కొన్నారని నేతలు వివరించారు. టీడీపీ సభ్యుడిగానే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారని కూడా టిటిడిపి నేతలు స్పష్టం చేశారు. అలాగే, ఏయే పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని రాష్ట్రపతి ప్రశ్నించగా, టీడీపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారని టీడీపీ బృందం వివరించింది. తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం 63 మాత్రమే అయినా విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ప్రస్తుతం దాని బలం 83కు పెరిగిందని స్పష్టం చేసింది.

 Also Read: తలసాని శ్రీనివాస్ వ్యవహారంలో గవర్నర్ పై మర్రిశశిధర్ రెడ్డి మండిపాటు

అయితే ఫిరాయింపుదారులకు సంబందించిన వివాదం కోర్టు విచారణలో ఉంది కదా? అని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ విషయమై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు కూడా జారీచేసిందని, అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరడంద్వారా వాటికి సమాధానాలు చెప్పకుండా స్పీకర్‌ దాటవేస్తున్నారని టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. దాంతో ఫిరాయింపులపై మీ వినతి పత్రాన్ని కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించి తగు చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని టీడీపీ బృందానికి రాష్ట్రపతి హామీ ఇచ్చారు. ప్రధానంగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసానితోపాటు తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రె డ్డి, మాధవరం కృష్ణారావులను పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ నేతలు వినతిపత్రంలో కోరారు. పార్టీ ఫిరాయించిన తలసాని ఏకంగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు గత ఏడాది డిసెంబర్‌ 16న ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించినా.. ఆయన రాజీనామాను ఆమోదించారా లేక తిరస్కరించారా? అనే అంశాన్ని శాసనసభ స్పీకర్‌ ఇప్పటి వరకూ ప్రకటించలేకపోయారని వివరించారు. తమ విధులను నిర్వర్తించడంలో రాజ్యాంగ పదవుల్లో కొనసాగుతున్న గవర్నర్‌, స్పీకర్‌ విఫలమయ్యారని స్పష్టం చేశారు.

Also read : తలసానిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి.. బౌన్సర్ గా పనిచేసినోడు విమర్శలు చేస్తున్నాడట

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles