Goofed Up | Kandahar Hijack | IC-814 |RAW | A S Dulat

Handling of kandahar hijack was goofed up says former raw chief a s dulat

Goofed Up, Kandahar Hijack, IC-814,RA&W, A S Dulat

Handling of Kandahar Hijack Was Goofed Up Says Former RAW Chief A S Dulat The man who monitored the crisis arising from the 1999 hijack of IC-814, former RA&W chief A S Dulat, has admitted that the Crisis Management Group (CMG) had "goofed up" the operation.

ఆ హైజాక్ విషయంలో మనం దద్దమ్మలయ్యాం

Posted: 07/03/2015 01:03 PM IST
Handling of kandahar hijack was goofed up says former raw chief a s dulat

ఇదేదో చిన్నా చితకా విషయం కాదు. చెప్పింది కూడా ఏ మామూలు వ్యక్తో కాదు. దేశ భద్రతలను పర్యవేక్షించే రా కి అధిపతిగా పని చేసిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాబట్టి వార్తల్లో నిలుస్తోంది. కాందహార్ హైజాక్ సమయంలో అందరం దద్దమ్మలయ్యాం అన్న మాటల్లో చాలా విషయం దాగి ఉంది. 1999లో ఎయిరిండియా విమానం హైజాక్ కావడంపై.. తర్వాత జరిగిన పరిణామాలపై రా మాజీ డైరెక్టర్ ఏఎస్ దౌలత్ తాజాగా విడుదల చేసిన కాశ్మీర్ ది వాజ్ పేయ్ ఇయర్స్ అనే పుస్తకంలో దేశం అవాక్కయ్యే విషయాలను తెలిపారు. 1999లో ఖాట్మాండు నుండి బయటుదేరిన IC-814 విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేశారు. అయితే తర్వాత ఫ్యూయల్ కోసమని అమృత్ సర్ లో ఆపారు. ఆ తర్వాత దుబాయ్ నుండి కాదంహార్ కు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే మనం దద్దమ్మలుగా మారిన వైనాన్ని దౌలత్ తన పుస్తకంలో వివరించారు.

పంజాబ్ లోని అమృత్ సర్ లో విమానం ఆగినప్పుడు అప్పటి పోలీస్ చీఫ్ సరబ్ జీత్ సింగ్ ఆపరేషన్ కు అంతా సిద్దం చేసినా కానీ అది ఫలించలేదు. సరబ్ జీత్ సింగ్ యాంటీ టెర్రరిజంలో ఎంతో ట్రెయినింగ్ తీసుకున్న కమాండోలు సిద్దంగా ఉన్నా కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం దేనికీ ఊ కొట్టలేదని అన్నారు. డిల్లీ నుండి ఆదేశాలు జారీ అయితే చాలు అమృత్ సర్ విమానాశ్రయంలోనే అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నా కానీ చేష్టలూడి చూస్తూ కుర్చున్నామని.. హైజాకర్లు మనల్ని దద్దమ్మలను చేసి విమానాన్ని దేశం దాటించేశారని అన్నారు. తర్వాత వారి డిమాండ్లకు తలొగ్గి కరుడుగట్టిన టెర్రరిస్టులను విడుదల చేశామని వివరించారు. ఇలా అందరం భయపడుతూ ఎవరూ కూడా పిల్లి మెడలో గంట కట్టలేని ఎలుకల్లా తయారయ్యాం అని దుయ్యబట్టారు. ఒది మాత్రమే కాదు గతంలో హోంమంత్రిగా పని చేసిన, ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ సిఎంగా పని చేస్తున్న ముఫ్తీ మహ్మద్ కూతురి విషయంలోనూ ఇదే జరిగిందని అన్నారు. అందరూ కూడా ముఫ్తీ వద్ద మార్కులు కొట్టెయ్యడానికి మాత్రమే ప్రయత్నించారని కానీ వాస్తవాలను మాత్రం అంగీకరించలేదని అన్నారు. ఇలా ప్రతి సారి ఢిల్లీ కాళ్ల బేరానికి వచ్చింది అన్న అపవాదును మిగిల్చారని దౌలత్ వివరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goofed Up  Kandahar Hijack  IC-814  RA&W  A S Dulat  

Other Articles