ED | America | california | Attach | Land | Enforcement Directorate

Ed attaches zoom developers rs 1000 cr worth land in us

ED, America, california, Attach, Land, Enforcement Directorate

ED attaches Zoom Developers Rs 1000 cr worth land in US In the first such action, the Enforcement Directorate (ED) has attached 1,280 acres of land in the US in connection with one of the biggest bank loan frauds in this country.The unprecedented move to attach the land in California worth Rs 1,000 crore was initiated by the ED’s Ahmedabad zonal unit.

అమెరికాలోని 1280 ఎకరాల భూమిని అటాచ్ చేసిన ఈడి

Posted: 07/03/2015 01:32 PM IST
Ed attaches zoom developers rs 1000 cr worth land in us

ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఓ బ్యాంక్ లోన్ మోసం కేసులో అమెరికాలోని వెయ్యి ఎకరాలకుపైగా భూమిని అటాచ్ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా అమెరికాలోని భూమిని స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. అమెరికాలోని కాలిఫోర్నియాలో 1,280 ఎకరాల స్థలాన్ని అహ్మదాబాద్‌కు చెందిన ఈడి అధికారులు జప్తు చేశారు. జూమ్ డెవలపర్స్, దాని ప్రమోటర్ విజయ్ చౌధరి 2,200 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి మోసానికి పాల్పడిన కేసులో ఈడి ఈ చర్యకు దిగింది. విజయ్ చౌధరి ప్రస్తుతం పరారీలో ఉండగా, ఐరోపా దేశాల్లోని ప్రాజెక్టుల కోసం రుణం ద్వారా ఈ 2,200 కోట్ల రూపాయలను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టులేవీ మొదలవకపోగా, నిధులు పక్కదారి పట్టాయి. ఇదిలావుంటే జప్తు చేసిన 1,280 ఎకరాల స్థలం మార్కెట్ విలువ 1,000 కోట్ల రూపాయల మేర ఉంటుంది. అమెరికాలో ఈడికి ఇది తొలి అటాచ్‌మెంట్ అని రికార్డులు చెబుతున్నాయి

ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 1,280 ఎకరాల స్థలం ఈ స్థలం బ్యాంకు రుణ మోసం కేసులతో సంబంధం ఉన్న జూమ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాని ప్రమోటర్‌ విజయ్‌ చౌధురికి సంబంధించింద. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ స్థలాన్ని జప్తు చేసినట్టు చెప్పారు.విజయ్‌ చౌధురి పరారీలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్‌ శరద్‌ కబ్రా మాత్రం ఇండోర్‌ ఇడి అధికారులకు చిక్కాడు. ఈ కేసులో రుణాలిచ్చిన బ్యాంకు పాత్రపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలున్న దుబాయ్‌ వ్యాపార వేత్త మనీష్‌ షాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈయనను మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ముందు హాజరు పర్చారు. గుజరాత్‌ కేంద్రంగా హవాలా దందా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి షాకు 700 కోట్ల రూపాయలు అందినట్టు ఈడి ఆరోపిస్తోంది. 5,395 కోట్ల రూపాయలకు పైగా హవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్న అఫ్రోజ్‌, మదన్‌లాల్‌ జైన్‌ల నుంచి ఈ సొమ్ము వచ్చినట్టు చెబుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ED  America  california  Attach  Land  Enforcement Directorate  

Other Articles