Delhi | Kejriwal | Power bill | BJP | Arvind Kejriwal

Delhi cm arvind kejriwal june power bill for oen lakh thirty thousand

Delhi, Kejriwal, Power bill, BJP, Arvind Kejriwal

Delhi's aam aadmi chief minister, Arvind Kejriwal, has run up an electricity bill of about Rs 1.35 lakh from two meters for June at his official residence - 6, Flag Staff Road, Civil Lines.

ఆమ్ ఆద్మీ కరెంట్ బిల్ లక్షా ముప్పై ఐదు వేలు

Posted: 07/03/2015 11:49 AM IST
Delhi cm arvind kejriwal june power bill for oen lakh thirty thousand

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ అద్మీ కాదు విఐపి అనేందుకు మరింత బలం చేకూరుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. మామూలు వ్యక్తుల కరెంట్ బిల్ ఎంత వస్తుంది మహా అయితే వెయ్య లేదంటే రెండు వేలు కానీ పేరుకు ఆమ్ ఆద్మీ అని చెప్పుకునే వారికి మాత్రం అంత వస్తుందా ఏంటి. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇదే నిజమైంది. `విఐపి కల్చర్ కు మేం వ్యతిరేకం.. మేము పొలిటికల్ లీడర్లం కాదు ఆమ్ ఆద్మీ అంటే సాధారణ వ్యక్తులం  అంటూ చేసిన ప్రచారం కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం. ఎందుకంటే ఢిల్లీకి సిఎం అయిన తర్వాత ఆమ్ ఆద్మీ అమీర్ ఆద్మీగా, విఐపిగా మారిపోయారు. అయితే ఢిల్లీ ఎన్నికల సమయంలో కరెంట్ బిల్ గురించి గంట కొద్దీ మాటలు, టన్నుల కొద్ది హామీలు ఇచ్చిన అరవింద్ గురివింద  చందాన్ని మాత్రం మరిచారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఇంటి బిల్లు ఏకంగా లక్షా ముప్పై ఐదు వేలు రావడం తాజాగా వార్తల్లో నిలిచింది.  బిజెపి నాయకులు దీన్నే అస్ర్తంగా చేసుకొని విమర్శలు కురిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీకి ఇంత బిల్ వస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో తొంభై ఐదు వేల బిల్ అంటూ వార్తలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ భజన బృందం మాత్రం దాన్ని ఖండించింది. కానీ తాజాగా జూన్ నెలలోనే లక్షా ముప్పై వేల బిల్ రావడంతో వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం ఉంటున్న కేజ్రీవాల్ ఇంటిలొ రెండు మీటర్లు ఉన్నాయి. అయితే రెండు కూడా డొమెస్టిక్ క్యాటరీకి చెందినవే. అయితే రెండు మీటర్లకు కలిపి లక్షా ముప్పై వేల బిల్ వచ్చింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలో 30 ఏసీలు ఉన్నాయని కూడా బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. మరి దీని మీద కేజ్రీవాల్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Kejriwal  Power bill  BJP  Arvind Kejriwal  

Other Articles