KFC refutes it served 'fried rat' instead of chicken after US man posts picture on Facebook

Kfc serves man fried rat instead of fried chicken

KFC Serves Man Fried Rat Instead Of Fried Chicken, KFC refutes, KFC refutes it served 'fried rat', United States, outrage on kfc, kfc denies charges, fried rat, chicken wings, Kentucky Fried Chicken (KFC) outlet, food safety, United States, KFC, Watts, California, Devorise Dixon, two photos and a video, Facebook

KFC refutes it served 'fried rat' instead of chicken after US man posts picture on Facebook

ITEMVIDEOS: KFC లో చికెన్ కొంటున్నారా..? అయితే జాగ్రత్తా..!

Posted: 06/17/2015 05:27 PM IST
Kfc serves man fried rat instead of fried chicken

వీకెండ్ లో కాని, పిల్లల బలవంతంపై కానీ కె ఎఫ్ సీ కి వెళ్లి చికెన్ ఆర్డర్ ఇద్దామనుకుంటున్నారా..? అయితే జాగ్రత్తా..! అమెరికా కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ దిగ్గజ సంస్థ కెంటుకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్.సి) షాపులో చికెన్ ఆర్డర్ ఇస్తే.. ఎలుకను సర్వ్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ విసయం అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వార్త దవానంలా వ్యాపించి.. పలువరు మాంసాహార ప్రియులను విస్మయానికి గురిచేస్తుంది.

వివరాల్లోకి వెళ్తే. డివోరైస్ డిక్సన్ అనే వ్యక్తి మంచి ఆకలిపై వుండటంతో అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో వాట్స్ ప్రాంతంలో వున్న కె ఎఫ్ సి షాపులోకి వెళ్లి.. చికెన్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే కొంత సేపటికి సదరు దుకాణం వారు ఆయన ముందు మాంసాహారాన్ని పెట్టారు. మంచి ఆకలిపైనున్న తాను దానిని కొద్దిగా విరిచి నోట్లో పెట్టుకోగా. చికెన్ లా మృధువుగా కాకుండా.. అది గట్టిగా సాగుతుందని గమనించాడు. దీంతో తనకు తెచ్చిన ప్లేటులో చికెన్ ను పరీక్షించి చూడగా, అది చికెన్ కాదని, ఎలుక అని తెలుసుకున్నాడు.

వెంటనే దానికి సంబంధించిన రెండు ఫోటోలను, ఓ వీడియోను తీసి.. ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో ఆ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే తాను సదరు స్టోర్ మేనేజరుతో ఈ విషయమై మాట్లాడానని, తాము తప్పు చేసినట్లు ఆయన అంగీకరించాడని, ఆ తరువాత తనకు ఎవరైతే ఈ డిష్ ను సర్వ్ చేశాడో అతను కూడా వచ్చి క్షమాపణలు కోరాడని చెప్పారు. కాగా ఈ విషయాన్ని తాను ఇంతటితో వదలబోనని, న్యాయస్థానం తెల్చుకుంటానని కూడా డిక్సన్ సూచించాడు.

ఇదిలావుండగా, తమపై అనవసర అభాండాలు మోపుతున్నారని కేఎఫ్సీ ఆరోపించింది. ఫిర్యాదు చేసిన వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా అతడు మాట్లాడేందుకు నిరాకరించాడని పేర్కొంది. చికెన్ ఆర్డ్ ఇస్తే అందులో ఎలుక వచ్చిందంటూ కేఎఫ్సీపై ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో కేఎఫ్సీపై పలు రకాల విమర్శలు వచ్చాయి. వాటిని సీరియస్గా తీసుకున్న కేఎఫ్సీ ఎట్టకేలకు స్పందించింది. పోస్ట్ చేసిన వ్యక్తిని తాము కలిశామని, అయితే అతడు తమతో మాట్లాడలేదని, ప్రొడక్ట్ను పరీక్షలకు పంపుతామని అడిగినా అందుకు అతడు నిరాకరించడని వివరణ ఇచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KFC  fried rat  chicken wings  California customer  facebook  

Other Articles