Pappu Yadav behaves rudely with air hostess

Airhostess complains of pappu yadav harassment

Pappu Yadav behaves rudely with air hostess, Pappu Yadav, Pappu Yadav airline, Pappu Yadav misbehaves, Jet Airways, Pappu Yadav disrupts flight, Bihar MP, Airhostess, Ajit Sarkar, bIhar, Jet Airways, Kim Davy, Pappu Yadav, patna to delhi

A parliamentarian from Bihar, Pappu Yadav, allegedly misbehaved on a Jet Airways flight and threatened to hit an airhostess with slippers, forcing the pilot to call for security.

ఎయిర్ హాస్టస్ వివాదంలో పప్పుయాదవ్.. విచారణకు అర్జేబి డిమాండ్

Posted: 06/17/2015 05:25 PM IST
Airhostess complains of pappu yadav harassment

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ బహిష్కృత పార్లమెంటు సభ్యడు, బీహార్ కు చెందిన నేత పప్పూ యాదవ్ మరో వివాదంలో చిక్కకున్నారు. విమాన సిబ్బందిని వేధించిన వివాదంలో ఆయన ఇరుక్కున్నారు. పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన తనకు బోజనాలను సర్వ్ చేసిన ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా  ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మిగిలిన ఆహార పదార్థాలను కింద వేయొద్దు అని వారించిన ఎయిర్ హాస్టస్ పై విరుచుకుపడి. తన సీటు బెల్టు కూడా తోలగించి తనను తోసివేశాడని ఎయిర్ హాస్టస్ ఆరోపించారు. తనపై అన్యాయంగా విరుచుకు పడ్డారని, వేధించారని అమె విమానం ఫైలెట్ కు పిర్యాదు చేశారు.

దీనిని జెట్ ఇండియా వర్గాలు వర్గాలు ధృవీకరించాయి. విమానం ఢిల్లీలో దిగేముందు రక్షణ కావాలని కెప్టెన్ తమకు సమాచారం అందించారని తెలిపాయి. ఓ ప్రయాణీకుడు అభ్యంతరకరంగా  ప్రవర్తిస్తున్నాడని..సెక్యూరిటీ సాయం కావాలనే కోరడంతో అప్రమత్తమైనట్లు వెల్లడించాయి. అయితే  ఈ  వివాదంలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. కాగా ఈ ఆరోపణలను ఎంపీ పప్పూ యాదవ్ ఖండించారు.  ఇదంతా తనపై రాజకీయంగా జరుగుతున్న కుట్ర  అన్నారు.  

కాగా, ఎయిర్ హాస్టస్ పట్ల ఎంపీ పప్పుయాదవ్ అనుచిత వైఖరిపై బిజేపి నేతలు జీవిఎల్ నరసింహారావు, సుబ్రహ్మణ్య స్వామీలు తప్పుబట్టారు. తక్షణం ఆయన ఎయిర్ హాస్టస్ తో పాటు విమాన సిబ్బందికి క్షఃమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు సభ్యుడనగానే ప్రజలు వారి నుంచి వినయాన్ని, వినమ్రతను కోరుకుంటారని, దురుసు ప్రవర్తనను కాదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇక మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ పప్సుయాదవ్ బహిష్కరించిన ఆర్జేడీ కూడా ఈ విషయమై స్పందించింది. ఈ వ్యవహారంలో పప్పుయాదవ్ పై విచారణను జరిపించాలని డిమాండ్ చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air hostess  Pappu Yadav  Jet Airways  Misbehave  Conspiracy  

Other Articles