Lalit Modi Tweets 'My Turn to Get Everything out' as Congress Targets PM Modi, Sushma Swaraj

Congress targets pm modi sushma swaraj lalit modi alleges political conspiracy

Opposition parties, congress, NSUI, stages protest, demands resignation, UK government, Sushma Swaraj, Lalit Modi, Keith Vaz, External Affairs Minister, Delhi High Court, Congress party Leader, sushma swaraj, UK's top immigration official, British travel papers to Lalit Modi, British High Commissioner, humanitarian view, Indo-UK relations, Lalit Modi visa controversy

Lalit Modi, the man in the middle of the controversy, broke his silence in a series of tweets this evening in which he promised to "get everything out."

అన్నీ గమనిస్తున్నాను.. ఇక నా వంతు వస్తుంది..

Posted: 06/15/2015 10:59 PM IST
Congress targets pm modi sushma swaraj lalit modi alleges political conspiracy

తన భార్యకు సోకిన క్యాన్సర్ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించేందుకు పోర్చుగల్ దేశానికి వెళ్లేందుకు వీలుగా తనకు వీసా లభించే విధంగా కేవలం మానవత్వ దృక్పతంలో సిఫార్సు చేసి సహాయాన్ని అందించి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చిక్కుల్లో పడటంతో ఎట్టకేలకు ఈ వ్యవహరాంలో కీలక వ్యక్తి స్పందించాడు. ఎవరాయన..? అంటారా..? అయనే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ స్పందించారు. ఇవాళ సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమం ట్విట్టర్ ధ్వారా ఆయన పలు అంశాలపై పోస్టులను చేశాడు.  ఈ వ్యవహారంలో తాను అన్ని అంశాలను క్షుణ్ణంగా గమనిస్తున్నానని, ఇకపై తన వంతు కూడా వస్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరికలు చేశాడు.

భారత్లో తనపై చేస్తున్న కుట్రలను గమనిస్తున్నానని, తాను స్పందించాల్సిన సమయం వచ్చిందని మోడీ ట్వీట్ చేశారు. బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలెన్నో బయటపెడతానని వెల్లడించారు. తనపై మీడియా బురదజల్లుతోందని మోడీ  ఆరోపించారు. 2010 నుంచి ఇప్పటి వరకు బీసీసీఐ, ఐపీఎల్లో ఎవరెవరు ఏం చేశారన్న విషయాలన్నింటినీ సవివరంగా బయటపెడతానని మోడీ పేర్కొన్నారు. లలిత్ మోడీ బ్రిటన్ నుంచి ప్రయాణ పత్రాలు (ట్రావెల్ డాక్యుమెంట్స్- టీడీ) పొందేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారని ఆరోపణలు రావడంతో ఆయన దీనిపై స్పందించారు. కాగా ఆయన తరపు న్యాయవాది మాత్రం లలిత్ మోడీ పై జరుగుతున్న వ్యవహారమంతా రాజకీయ కుట్రగా అభివర్ణించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  congress  NSUI  protest  lalit modi  resignation  

Other Articles