KCR, section8, Governor, Hyderabad, Telangana, Ap, Chandrababu, Tapping

Telangana cm kcr clear that no need to implement section 8 in hyderabad

KCR, section8, Governor, Hyderabad, Telangana, Ap, Chandrababu, Tapping

Telangana cm KCR clear that no need to implement section 8 in hyderabad. KCR met Governor Narasimhan and said that telangana state will oppose the section 8.

గవర్నర్ గారు వద్దే వద్దండి.. కాదు కూడదు అంటే..

Posted: 06/16/2015 07:48 AM IST
Telangana cm kcr clear that no need to implement section 8 in hyderabad

ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనాన్ని రేపిన ఓటుకు నోటు వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు తెర తీసింది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఉమ్మ్డి హైదరాబాద్ లో తమకు రక్షణలేకుండా పోయిందని కాబట్టి హైదరాబాద్ లొ సెక్షన్-8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం వత్తిడి తీసుకువస్తోంది. సెక్షన్‌ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, సెక్షన్‌ 8 అమలుపై తాను నిర్ణయం తీసుకోవడానికి బదులుగా.. దానిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని గవర్నర్‌ నరసింహన్‌ భావించారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించి ఈ అంశంపై చర్చించారు. కేసీఆర్‌ గవర్నర్‌తో దాదాపు గంటన్నరపాటు భేటీ అయ్యారు.

తాజా రాజకీయ పరిణామాలు, సెక్షన్‌ 8 అమలుకు ఏపీ సర్కారు పట్టుపడుతుండటం, ఈ విషయంలో కేంద్ర సర్కారు మనోగతం, స్టింగ్‌ ఆపరేషన్‌పై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల వైఖరి వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా, ఒక రాష్ట్ర రాజధానిలో మరో రాష్ట్రానికి చెందిన పోలీసుల ప్రమేయం ఉండడం, ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, శాంతి భద్రతలను గవర్నర్‌ చేతిలో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. అప్పట్లో బిల్లు పాస్‌ కావటం కోసం.. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు భరోసా కల్పించటం కోసం కంటితుడుపు చర్యగా ఆ సెక్షన్‌ పెట్టారని, దీనిపై ఇప్పటి వరకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. ఒకవేళ కేంద్రం ఈ సెక్షన్‌ను అమలు చేయాలనుకుంటే, తెలంగాణ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుందని, కోర్టులో కూడా నిలబడదని గవర్నర్‌కు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్‌ 8ని అమల్లోకి తేవటానికి అంగీకరించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. అలా సెక్షన్-8 అమలు వీలు కాదని, కాదని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినా కోర్టులో తేల్చుకుంటామని కేసీఆర్ గవర్నర్ కు స్పష్టం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : KCR  section8  Governor  Hyderabad  Telangana  Ap  Chandrababu  Tapping  

Other Articles