Telangana | Notifications | jobs | KCR | June2

Telangana govt ready to release notification for near to ten thousand posts on june 2

Telangana, Notifications, jobs, KCR, June2

Telangana govt ready to release notification for near to ten thousand posts on june 2. Telanagana govt didnt release even one notification from last one year.

పది వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

Posted: 05/30/2015 10:11 AM IST
Telangana govt ready to release notification for near to ten thousand posts on june 2

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే అన్కని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావ ఏర్పాటులో కీలక ఘట్టాలను అన్నింటిని స్మరించుకునేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత కొంత కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ ఉద్యోగ ప్రకటనకు సిద్దమవుతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా రాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. పైగా ఉద్యమానికి పురిటిగడ్డైన ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. దానికి తోడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చెయ్యాలని గత కొంత కాలంగా డిమాండ్ గట్టివినిపిస్తోంది. అందుకే తెలంగాణ సర్కార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నోటిఫికేషన్స్ జారీ చెయ్యాలని ఎదురుచూస్తోంది. మొత్తానికి నిరుద్యోగులకు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు అందనున్నాయి. జూన్ 2వ తేదీన 10 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Notifications  jobs  KCR  June2  

Other Articles