Temperature | death toll | Sunstroke | ap | telangana | delhi

On high level temepatures in india death toll hike to 1800

Temperature, death toll, Sunstroke, ap, telangana, delhi

On High level temepatures in India, death toll hike to 1800. From last one month people die due to high temperatures. In telugu states and delhi, gujarat and some other states more sufering from sunstroke.

ఎండదెబ్బకు 1800 మంది ఔట్

Posted: 05/30/2015 09:11 AM IST
On high level temepatures in india death toll hike to 1800

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండల్లో ఎక్కువ సమయం ఉంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వడగాడ్పులు చాలా ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ వడగాడ్పులకు మరణించినవారి సంఖ్య 1,800కు పైనే. వీరిలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని నిర్మాణ కార్మికులే. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికి 1,750 మంది వడదెబ్బకు మరణించారు. ఈ వారం మొదట్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీ సెల్సియస్‌కు చేరడంతో ఢిల్లీలోనే కాక గుజరాత్‌, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలు మృత్యువాత పడ్డారు. వడదెబ్బ తగిలిన వారితో ఢిల్లీలోని ఆస్పత్రులు పూర్తిగా నిండిపోయాయి. వారు తీవ్రమైన తలనొప్పితో, కళ్లు తిరగడంతో బాధపడుతున్నారు.

కొందరిలో సంధి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గత ఏడాది కన్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంలో కూడా తీవ్రమైన వడగాడ్పులు వీచిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో 2003 వడదెబ్బకు 3,000 మంది చనిపోయారు. అలాగే, 2010లోనూ అంతేమంది చనిపోయారని రాష్ట్ర అధికారులు తెలిపినా, చనిపోయిన వారి సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. భారతదేశంలో వాతావరణ మార్పుల కారణంగానే ఇంతటి తీవ్రమైన వడదెబ్బలకు జాతి బలవుతోందని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. 1950ల నుంచి చాలా ఆసియా దేశాల్లో చలి రోజులు తగ్గిపోయాయని, వేడి రాత్రులు ఎక్కువయ్యాయని గణాంకాలు తెలుపుతున్నాయి. చాలా కాలం తర్వాత ఇలాంటి ఎండలు చూస్తున్న జనం బెంబేలెత్తుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temperature  death toll  Sunstroke  ap  telangana  delhi  

Other Articles