ys jagan controversial comments on chandrababu naidu during farmers bharosa yatra | Political Settairs

Ys jagan controversial comments chandrababu naidu ap state farmers

ys jagan, chandrababu naidu, ys jagan bharosa yatra, ys jagan farmers yatra, ys jagan updates, jagan mohan news

ys jagan controversial comments chandrababu naidu ap state farmers : ys jagan makes controversial comments on chandrababu naidu during farmers bharosa yatra in atp and kadapa districts

చంద్రుడిని నమ్మి ‘బాబూ’ అంటున్న రైతులు..

Posted: 05/28/2015 12:03 PM IST
Ys jagan controversial comments chandrababu naidu ap state farmers

పూర్ణమినాడు కనిపించే చంద్రుడు ఎంతో వెలుగునిస్తాడు. భయంకరమైన చీకటిలో భయపడుతున్నవారికి అభయహస్తంలా నేనున్నాంటూ ప్రకాశిస్తాడు. కానీ.. కారుమబ్బులు అడ్డొస్తే చంద్రుని వెలుగు ఏమాత్రం కనిపించదు. ఈ విధమైన పరిస్థితియే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రాభివృద్ధికోసం, రైతున్నలకు ఆపన్నహస్తం ఇవ్వడంకోసం సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. కేంద్రప్రభుత్వం ఆయనకు సహకరించడం లేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బాబు ముందుకెళుతున్నారు. అటు.. రాష్ట్రంలో విపక్ష పార్టీ వైకాపా సైతం తమ విమర్శలతో ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేసే ప్రతి పనిలోనూ కారుమబ్బుల్లాగే అడ్డుపడుతూ ప్రజలను మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ, వైకాపా పార్టీ మధ్య వైరం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి భగ్గమనేంత శత్రుత్వం వుంటుంది. ముఖ్యంగా వైకాపా అయితే టీడీపీపై నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి వైకాపాధినేత జగన్ మరోసారి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులెందరో నాశనమయ్యారని జగన్ విమర్శించారు. వారి తరపున పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రైతుల కష్టాలు తీరుస్తానని ఎన్నికలముందు హామీ ఇచ్చిన బాబు.. ఇప్పటివరకు వారికి చేయూతనిందించలేదని, మాయమాటలు చెప్పి బాబు రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. రైతులు కన్న ఎన్నో ఆశలు బాబు అడియాశలు చేశారని జగన్ పేర్కొన్నారు.

అనంతపురం, కడప జిల్లాల్లో వైఎస్ జగన్ రైతు భరోసాయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే ఆయన ఆత్మహత్యలు చేసుకు రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ యాత్రలో ఆయన ఓ రైతు గోడు తెలుసుకుంటున్న సందర్భంగా తీసిన ఫొటోను ట్విటర్‌లో పెట్టారు. ఆ రైతు గురించి వివరిస్తూ ఇలాంటి రైతులను ఆదుకోవాలని జగన్ ట్వీట్ చేశారు. రైతుల ఆశలు పూర్తిగా సన్నగిల్లనివ్వరాదని, వారికి అండగా నిలవాలని ఆయన అబిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  farmers bharosa yatra  chandrababu naidu  

Other Articles