Telangana | Eamcet | Results

Telangana eamcet results released

Telangana, eamcet, results, release, kadiyam srihari

Telangana eamcet results released. Telangana deputy cm Kadiyam srihari released the eamcet results just now.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Posted: 05/28/2015 12:19 PM IST
Telangana eamcet results released

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొద్దిసేపటి క్రితం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఎంసెట్ లో  85.98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో 85.98శాతం, ఇంజినీరింగ్ లో  70.65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ నెల 29 నుండి విద్యార్థులు ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కడియం శ్రీహరి వెల్లడించారు. ఇంజనీరింగ్ కు 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇవ్వగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు.  విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  eamcet  results  release  kadiyam srihari  

Other Articles