Aiims, Delhi, Operation, Kidney, UP

Four year old girl kidneys missing after operation

Aiims, Delhi, Operation, Kidney, UP

four Year Old Girl Kidneys 'Missing' After Operation Four-year-old Deepika Chandra had surgery to remove an inflamed kidney at the reputed AIIMS hospital in Delhi. A scan after the procedure uncovered a chilling fact - both her kidneys were missing.

ITEMVIDEOS: కిడ్నీ కహానీ.. చెడిపోయిందంటూ ఉన్న కిడ్నీ పీకేశారు

Posted: 05/28/2015 11:38 AM IST
Four year old girl kidneys missing after operation

ఎయిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. చెడిపోయిన కిడ్నీ తీసేస్తామని చెప్పిన వైద్యులు బాగున్న కిడ్నీ కూడా పీకేశారు. ఇదేమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని సలహా ఇచ్చారు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూపీలోని రాయ్ బరేలీకి చెందిన పవాన్.. చిరు వ్యాపారి. తోపుడు బండిమీద జ్యూస్ అమ్ముకుని జీవిస్తున్నాడు. అతని ఆరేళ్ల కూతురు దీపిక కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల సూచన మేరకు గత డిసెంబర్ లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి కూతురిని తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన అనంతరం దీపిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని, కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీని తొలిగిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఈ ఏడాది మార్చి 17న పాపకు పీడియాట్రిక్ విభాగంలో సీనియర్ సర్జన్ ఒకరు ఆపరేషన్ చేశారు.

అయితే ఆ తరువాత దీపిక తీవ్ర నొప్పితో బాధపడింది. దీంతో ఆమె తండ్రి వైద్యులకు చూపగా తల్లిదండ్రులు సహా ఆసుపత్రి సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అసలు ఆ పాపకు కిడ్నీలే లేవని తేలింది. దీంతో బాలిక తండ్రి ఎయిమ్స్ వైద్యులను సంప్రదించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అసలు 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే ఒక్క కిడ్నీ. దానినే తీసేశాం. రెండు కిడ్నీలు లేనేలేవు' అంటూ బుకాయించారు.కిడ్నీలు మాయం కావడంపై తండ్రి పవన్ అనుమానం వ్యక్తం చేశాడు. ఎయిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాతే తన పాప కిడ్నీలు మాయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aiims  Delhi  Operation  Kidney  UP  

Other Articles