Rajasthan | Gujjars | Reservation

Rajasthan gujjar onceagain strike for their reservation

Rajasthan, Gujjars, Reservation, Vasundhara Raje

Rajasthan gujjar onceagain strike for their reservation. From yesterday gujjars went to strike and stop all the trains.

రాజస్థాన్ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న గుజ్జర్లు

Posted: 05/22/2015 03:56 PM IST
Rajasthan gujjar onceagain strike for their reservation

రాజస్థాన్ గుజ్జర్ల గురించి విన్నారుగా.. అప్పుడెప్పుడో రిజర్వేషన్ల కోసం పోరాడుతూ వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ వాళ్లే తమ రిజర్వేషన్ల గురించి పట్టాల మీదకొచ్చారు. విద్యా,ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్‌ కోరుతూ రాజస్థాన్‌లో గుజర్లు చేపట్టారు. నిన్న బరత్‌పూర్‌లో గుజ్జర్లు రైల్‌రోకో నిర్వహించడంతో పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. 57 రైళ్లను మళ్లించాల్సి వచ్చింది. చివరకు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను కూడా మళ్లించక తప్పలేదు. శుక్రవారం ఉదయం కూడా గుజ్జర్ల రైల్‌రోకో కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చే 50 శాతం రిజర్వేషన్లలోనే తమకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని గుజ్జర్లు కోరుతున్నారు.
 
తమకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించిన తర్వాత మొత్తం రిజర్వేషన్‌ 50 శాతం దాటిపోవడం వల్ల చట్ట పరమైన సమస్యలు ఎదురవుతున్నాయని గుజ్జర్లు గుర్తుచేస్తున్నారు. తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం రిజర్వేషన్‌ 50 శాతం దాటిపోకుండా చూడాలని గుజ్జర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, రిజర్వేషన్‌ అంశం కోర్టులో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి వసుందరరాజే అంటున్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అప్పట్లో యుపిఎ సర్కార్ కు చెమటలు పట్టించిన గుజ్జర్లు తాజాగా వసుంధర రాజేకు చెమటలు పట్టిస్తున్నారు. మరి దీనిపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Gujjars  Reservation  Vasundhara Raje  

Other Articles