Dowry | Mango trees | Gujarat

Mango trees instead of dowry inj gujarat

Dowry, Mango trees, Gujarat

village in Prime Minister Narendra Modi's Kashi witnessed a unique wedding with a 'green dowry'. The natives of Kaneri village, about 15km from the city, started gathering at the house of Munka Devi on Thursday to see the special dowry brought by a just married couple. They kept on waiting curiously to have a glimpse of the bride and the dowry she had brought with her. For them it was an unusual wedding gift -a set of seven trees of fruits.

కట్నం వద్దు మామిడి చెట్లు కావాలి

Posted: 05/22/2015 04:30 PM IST
Mango trees instead of dowry inj gujarat

అమ్మాయి పుట్టింది అనగానే ఆ తండ్రికి గుండెల్లో ఏదో భయం. అమ్మాయి ఎలా పెంచాలి అని కాదు.. పెంచిన తర్వాత ఏ అయ్య చేతిలో పెట్టాలన్నా వాళ్లు అడిగే కట్నం గురించి. అందుకే అమ్మాయిలను కనేవాళ్లకు గుండె దడే. అబ్బాయికి అడిగినంతాఇచ్చుకున్నా..కూతురి కాపురం సజావుగా సాగుతుందా అంటే నో గ్యారంటీ. అలాంటిది ఆ వరుడి కుటుంబం మాత్రం తమ గొప్ప మనసుని చాటుకుంది. కట్నంగా నగదు, నగలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, బైకులు, కార్లు.. ఇలా గొంతెమ్మ కోర్కెలు కోరేవారున్న ఈ కాలంలో.. ఆ కుటుంబం మాత్రం అవేవీ వద్దంది. తమకు కట్నం కింద మామిడి మొక్కలు ఇస్తే చాలని పెళ్లి కూతురి కుటుంబాన్ని కోరింది.

ఈ ఘటన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాలోని కనేరీ గ్రామంలో జరిగింది. కనేరీకి చెందిన ఓంకార్ పటేల్ కు బేనిపూర్ కు చెందిన సరోజా పటేల్ తో వివాహం జరిగింది. అయితే ఓంకార్ తల్లిదండ్రులకు కట్నం తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే వారు 5 మామిడి మొక్కలు ఇవ్వాలని అడిగారు. వారు ఐదు అడిగితే వధువు తల్లిదండ్రులు 7 మామిడి మొక్కలు ఇచ్చారు. అమ్మాయిని కాపురానికి పంపుతూ ఆ మొక్కలు కూడా పంపారు. ఇప్పుడా మొక్కలను చూసేందుకు గ్రామస్థులు క్యూ కట్టారు. మొత్తానికి భలే ఉంది కదా. ఇలాంటి ఘటనలు మనలో ఓ చైతన్యాన్ని కలిగిస్తాయి అదే విధంగా చెట్లను పెంచాలన్న ఆలోచన కూడా గ్రేటే కదా..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dowry  Mango trees  Gujarat  

Other Articles