Woman CISF officer stops Union Minister Ramkripal Yadav from entering airport via exit gate

Made a mistake but had no wrong intentions ram kripal yadav

woman CISF officer, Union minister Ramkripal Yadav, Patna airport, Lok Sabha MP from Pataliputra, ayaprakash Narayan International Airport, Minister of State for Rural Development and Drinking Water., Ramkripal Yadav, Union Minister, Bharatiya Janata Party (BJP), Central Industrial Security Force (CISF), woman conistable, ram kripal yadav controversy

A gutsy woman CISF officer on Tuesday prevented Union minister Ramkripal Yadav from entering the Patna airport through the exit gate, forcing him to retreat and admit his mistake.

ITEMVIDEOS: అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా.. అమాత్యా..!

Posted: 05/19/2015 08:47 PM IST
Made a mistake but had no wrong intentions ram kripal yadav

ఆయన కేంద్ర మంత్రివర్యులు.. దీంతో తానేం చేసినా చెల్లబాటు అవుతుంది అనుకుంటే పొరబాటే.  మేము కేంద్ర అమాత్యులం మాకు ఎదురుతిరుగుతారా..? మే ఎలాగైనా  వెళ్తాం అనుకుంటే పరాభవం జరగక తప్పదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటారా..? కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ఇవాళ పాట్నా విమానాశ్రయంలో.. అలాంటి చేదు అనుభవం ఎదురైంది. పాట్నా విమానాశ్రయానికి వస్తున్న మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన సమయం అసన్నమవుతుందని భయటకు ( ఎగ్జిట్ ) వచ్చే గేటు నుంచి విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతే అక్కడున్న ఓ మహిళా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. అతడిని అడ్డుకుంది. ఇది వీఐపీ ఎంట్రెన్సు గేటు కాదని, పక్కనుంచి వెళ్లాలని సూచించింది. దీంతో పాపం అమాత్యుల గారు వేరే మార్గం గుండా విమానాశ్రయం లోనికి వెళ్లక తప్పలేదు

అయితే అనుమతించిన ప్రవేశ ద్వారం నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా తనను పంపించాలని వాదనలు చేసిన కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ అనంతరం తన తప్పును తెలుసుకుని తనను తాను నిందించుకున్నారు. తాను అలా చేయడం ఏ మాత్రం సరికాదని, తనది ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకున్నారు. ఇప్పటికే వీఐపీల సంస్కృతిపై తీవ్ర వివాదం నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఎంపీ విషయం చర్చనీయాంశం అయింది. బీహార్లోని పాట్నా విమానాశ్రయంలో మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను రిసీవ్ చేసుకునేందుకు మంత్రి రామ్ కృపాల్ వెళ్లారు.

ఆయన ఎగ్జిట్ (బయటకు) మార్గం ద్వారా వెళుతుండగా అక్కడ ఉన్న ఓ మహిళా అధికారి అడ్డుకొని అందరిలాగే (ఎంట్రీ) ప్రవేశ ద్వారం వెళ్లాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే తన ఉద్యోగం పొతుందని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయన ఆమెతో కాసేపు స్వల్ప వాదోవాదాలకు దిగడంతో ఆమె పై అధికారులను కూడా సంప్రదించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడం, దానిపై విమర్శలు కూడా తలెత్తడంతో కేంద్ర మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. విధులు సక్రమంగా నిర్వహించిన ఆ అధికారిని మెచ్చుకున్నారు కూడా దీంతో అమాత్యా అడుసు తోక్కనేలా.. కాలు కగడనేలా అంటూ పలువురు సూచనలు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram kripal yadav  patna airport  modi minister denied vip treatment  

Other Articles