Telangana | contract | employees | KCR

Telangana govt may regularise the contract employees soon

Telangana, contract, employees, KCR

Telangana govt may regularise the contract employees soon. Telangana cm kcr moving the files of contract employees.

కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మినెంట్..? త్వరలోనే..!

Posted: 05/15/2015 09:20 AM IST
Telangana govt may regularise the contract employees soon

ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ పై వరాల జల్లు కురిపించడమే కాకుండా పనిలోపనిగా 4300 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. ఆర్టీసీ సమ్మె ఫిట్ మెంట్ కోసం అయితే కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకో్కుండా స్వీట్ న్యూస్ చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుండి తెలంగాణలో ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్దతి మీద పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారా అనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులను అడగకుండానే పర్మినెంట్ చేసిన కేసీఆర్ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు తెలుసుకొని.. రెగ్యులరైజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వ విధానం త్వరలో వెలువడనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదిక ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. సీఎం పరిశీలించి ఆమోదించాక క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఒప్పంద ఉద్యోగులు వివిధ పద్ధతుల్లో నియమితులై ఉన్నందున వారందరి నియామక విధానాలను పరిశీలించిన కమిటీ నివేదికను సమగ్రంగా తయారు చేసినట్టు తెలిసింది. చట్టప్రకారమైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్, లేదా ఏదైనా కమిటీ ఎంపిక చేసినప్పుడు మాత్రమే ఉద్యోగులను నియమించాల్సి ఉండగా ఒప్పంద ఉద్యోగులు మాత్రం వివిధ రకాల పద్ధతుల్లో విధుల్లోకి రాగలిగారు. దీంతో ఏయే శాఖలు, సంస్థల్లోకి ఈ ఉద్యోగులు ఏ తరహాలో ఎంత మంది వచ్చారో తెలుసుకోవటానికే కమిటీ చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. పారా మెడికల్ వంటి ఒప్పంద ఉద్యోగులను నియమించినప్పుడు నిబంధనలను పాటించినా.. చాలా శాఖల్లో రిజర్వేషన్లు, సర్వీస్ నిబంధనలు, విద్యా అర్హతలు, వయస్సు వంటివి పట్టించుకోలేదు. కమిటీ ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌తో సహా సంబంధిత అంశాలు అన్నింటినీ పరిశీలించింది. న్యాయ, తదితర శాఖల అభిప్రాయాలను కూడా పొందినట్టు సమాచారం. మొత్తానికి ఇదే నిజమైతే మాత్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన విద్యార్థులకు కాస్త నిరాశే మిగులుతుంది. ఉద్యోగాలు, నీళ్లు అన్న కాన్సెప్ట్ తో తెలంగాణ ఉద్యమం మొదలైన విషయం అందరికి తెలిసింది. మరి విద్యార్థులు దీనిపై ఎలా స్పందిస్తారో.. విద్యార్థుల స్పందనను కేసీఆర్ ఎలా తీసుకుంటారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  contract  employees  KCR  

Other Articles