Police | Thief | navajeevan express

Police men become as thieves

Police, Thief, navajeevan express,

Police men become as thieves. In Navajeevan express police theft nearly 82 lakhs like thieves.

పోలీసోళ్లే దొంగలంట..!

Posted: 05/15/2015 08:39 AM IST
Police men become as thieves

దొంగతనం జరిగితే దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు డ్యూటీ మరిచారు. పోలీసులం అన్న ధ్యాసే లేకుండా దొంగల్లా దొంగతనానికి పూనుకుంటే ఎలా ఉంటుంది. అవును తాజాగా ఓ ఘటన పోలీసులే బెదిరించి దొంగల్లా దోపిడీకి తెగబడ్డారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారం కొనుగోలు చేసేందుకు నెల్లూరు వెళుతున్న వ్యాపారులను బెదిరించి రూ.82 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం సంచలనం సృష్టించింది. బాధితులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు నిందితులను వెంబడించి కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.82లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విచారించగా వీరిలో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులని తేలినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వేమూరి రామయ్య, బి.ఎం.సునీల్ బంగారం కొనుగోలు నిమిత్తం కావలి నుంచి నెల్లూరుకు రైలులో వెళ్తుండగా పోలీసులమని చెప్పిన నిందితులు తనిఖీల పేరిట వ్యాపారులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదును దోచుకున్నారు.

దాంతో లబోదిబోమంటూ వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు జాతీయ రహదారిపై పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు గుడ్లూరు కూడలి వద్ద కందుకూరు దిశగా వెళ్లినట్లు గుర్తించారు. మార్గమధ్యంలో నిందితులు అద్దె కారు కోసం ఓ కారుపై ఉన్న నంబరుకు ఫోన్ చేశారు. ఆ కాల్‌ను అందుకున్న డ్రైవర్ అందుకు నిరాకరించాడు. తర్వాత అటువైపు వచ్చిన పోలీసులు ఆరా తీసినపుడు డ్రైవర్ తనకు వచ్చిన ఫోన్ విషయం చెప్పి.. ఆ నంబరిచ్చాడు. ఈ నంబరును ఆధారంగా దొంగలు ఎక్కడున్నదీ, ఎటువెళుతున్నదీ పోలీసులు గుర్తించారు. రెండు గంటల తర్వాత ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు స్పెషల్‌పార్టీ కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం. అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Thief  navajeevan express  

Other Articles