Amtrak derailment| Philadelphia Amtrak derailment News| Mayor Michael Nutter

50 hurt and at least 5 casualties in amtrak train derailment in philadelphia

Port Richmond derailment, Amtrak Train Derailment, Philadelphia train accident, Mayor Michael Nutter, Train accident in America, Philadelphia train accident, Train derailment in Port Richmond

An Amtrak train derailed in Port Richmond, Philadelphia. As per initial reports 5 causualities and 50 individuals injured in the Washington, D.C bound train.

ITEMVIDEOS: ఫిలడెల్ఫియాలో అమ్ ట్రాక్ రైలుకు ప్రమాదం.. 5గురు మృతి, 60 మందికి గాయాలు

Posted: 05/13/2015 12:44 PM IST
50 hurt and at least 5 casualties in amtrak train derailment in philadelphia

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 238 మంది ప్రయాణికులతో రాజధాని నగరం వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తోన్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు గత రాత్రి ఫిలడెల్ఫియాలో పట్టాలు తప్పింది. ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ మూల మలుపు తిరిగే క్రమంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదురుగు మృతి చెందగా, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డాగా... వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు  అధికారులు తెలిపారు.

 

 

గత రాత్రి 7:10 కి వాషింగ్టన్ స్టేషన్ నుంచి బయలుదేన 188వ నంబర్ రైలు  10:34కు న్యూయార్క్ చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు స్టేషన్లకు సరిగ్గా మధ్యలో ఉండే ఫిలడెల్ఫియా వద్ద గల ఓ మూల మలుపు తిరిగే క్రమంలో నియంత్రణ కోల్పోయి రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు, సుమారు గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ఆమ్ట్రాక్ రైలు ప్రమాదానికి గురికావడమే మృతులు సంఖ్య పెరిగేందుకు కారణంగా కనిపిస్తుందని అధికారులు చెప్పారు. బోల్తా పడ్డ పది బోగీలు.. కొద్ది మీటర్లవరకు దొర్లుకుంటూ వెళ్లడంవల్ల పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని వివరించారు. సహాయక బృందాలు రంగంలోకిదిగి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై అగ్రరాజ్యం విచారణకు అదేశించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amtrak Train  Derailment  Philadelphia  train accident  

Other Articles