6.8-Magnitude Earthquake Strikes Off Coast of Japan

6 8 earthquake off the coast of japan

6.8 earthquake off the coast of Japan, Fukushima, 6.8-Magnitude Earthquake Strikes Off Coast of Japan, Earthquake, Japan, International, northeastern Japan, US Geological Survey, Japan, Honshu

A 6.8-magnitude earthquake struck Japan on Wednesday in the same region devastated by a major quake and tsunami in 2011. Authorities said there was no risk of tsunami.

జపాన్ లో మళ్లీ కంపించిన భూమి..రెక్టార్ స్కేలుపై 6.8గా తీవ్రత

Posted: 05/13/2015 11:55 AM IST
6 8 earthquake off the coast of japan

ప్రపంచ వ్యాప్త ప్రజలను భయకంపితులను చేస్తూ భూతల్లి ప్రళయకార నృత్యాన్ని చేస్తుంది. మనిషి తన ప్రాంతం, రాష్ట్రం, దేశ ప్రగతి కోసం చేస్తున్న మార్పులు.. అడుగులు ప్రకృతిని ఇబ్బందిపెడుతున్నాయని ఈ వరస ఘటనలు రుజువు చేస్తున్నాయా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవువతున్నాయి. మొన్న జపాన్, ఆ తరువాత నేపాల్, మళ్లీ తాజగా, ఇవాళ జపాన్లో భూకంపం సంభవింనింది. 2011లో జపాన్ లోని ఫుకుషిమా, హోన్షు ప్రాంతంలో సంభవించిన భూ ప్రళయానికి తోడు సునామి రావడంతో అతలాకుతలమైన జపాన్.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ భూకంపం సంభవించింది.

సరిగ్గా 2011లో భూకంపం సంభవించిన ప్రాంతంలోనే 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. జపాన్ లోని  ఈశాన్య ప్రాంతంలో హోన్షు ప్రాంతంలో ఇవాళ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రం హన్షు ద్వీపంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో 38.9 కిలోమీటర్ల అడుగు భాగంలో ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. సునామీ హెచ్చరికలు కూడా ఏమీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.  అయితే జపాన్ వాసులు మాత్రం బిక్కుబిక్కు మంటూ భయాందోళనకు జారుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  northeastern Japan  US Geological Survey  

Other Articles