Super mom gives birth to five daughters in 10 minutes

India s first girl quintuplets born in punjab sets record

india first girl quintuplets, punjab couple, quintuplets in punjab, sangrur couple five daughters, quintuplets, Kuldeep and Sukhpal Singh, female infanticide, Dr Harkiran Kaur, Beti Bachao, Beti Padhao; Adesh Hospital, Bathinda, five children, Adesh Institute of Medical Sciences and Research, Gidhariani village, Sangrur district, incubator, news,

A Sangrur couple became the parents of India's first-ever all-girl quintuplets to survive on Tuesday morning.

పంజాబ్ మహిళ రికార్డు.. పంచామృతాలు..

Posted: 05/07/2015 06:05 PM IST
India s first girl quintuplets born in punjab sets record

అమ్మాయి పుడితే అరిష్టంగా భావించి.. పురిట్లోనే చంపుతున్న కోందరు తల్లిదండ్రులకు, బార్యాబిడ్డలను వదిలేసి వెళ్తున్న మరికోందరికి.. వదిలించుకునేందుకు రోడ్డు పక్కన వదిలేసే ఇంకోందరికీ ఈ దంపతులు ఆదర్శంగా నిదర్శనంగా నిలుస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా.. పంజాబ్లో ఓ మహిళ ఒకే కాన్పులో పంచామృతాలకు (ఐదుగురు అమ్మాయిలకు) జన్మనిచ్చింది. భటిండా సమీపంలోని భుచో అనే పట్టణంలో కుల్దీప్ కౌర్ (32) అనే మహిళ ఈ ఐదుగురు ఆడ పిల్లలను కంది. ఆమె భర్త ఓ రైతు. ఈ కేసు బాగా సంక్లిష్టమైనది కావడంతో ఎవరూ కాన్పు చేసేందుకు సిద్ధం కాలేదని, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కాన్పు చేసిన గైనకాలజిస్టు డాక్టర్ హర్కిరణ్ కౌర్ చెప్పారు. కడుపులో ఐదుగురు బిడ్డలతో.. కేవలం 5 గ్రాముల హెమోగ్లోబిన్తో ఆమె వచ్చింది. తొలుత స్కానింగులో నలుగురు పిల్లలే ఉన్నట్లు కనిపించినా, తీరా బయటకు వచ్చేసరికి ఐదుగురు అయ్యారు.

కుల్దీప్తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా క్షేమంగానే ఉన్నా.. మరో ఇద్దరి పరిస్థితి మాత్రం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఏడోనెలలోనే డెలివరీ కావడంతో వాళ్లు కేవలం 850 గ్రాములు మాత్రమే బరువున్నారని, అందువల్ల వాళ్లను 24 గంటలూ పర్యవేక్షిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నామని డాక్టర్ కౌర్ చెప్పారు. కాగా, సుఖ్పాల్ సింగ్, కుల్దీప్లకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిపి మొత్తం ఏడుగురు కూతుళ్లవుతారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిడంతో పేదరికంలో ఉన్నా కూడా.. ఇప్పుడు ఈ ఐదుగురు కూతుళ్లకు కూడా జన్మనివ్వాలనే వాళ్లు నిర్ణయించుకున్నారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తేనే అబార్షన్ చేయించే ఈ రోజుల్లో.. ఇలా ఏడుగురిని పెంచేందుకు కూడా సిద్ధం కావడం ప్రశసంనీయమని వైద్యులు అంటున్నారు. అయితే తన కూతుళ్లందరికీ తాను విద్యబుద్దులు చెప్పించడానికి ఎలాంటి కష్టానైనా పడతానని సుఖ్ ఫాల్ సింగ్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : quintuplets  punjabi woman  5 girl children  

Other Articles