Fans, celebrities throng Salman Khan residence at Bandra

Salman khan interim bail in hit and run case challenged in sc

Salman Khan hit-and-run case, guilty, Salman khan Verdict, Special Leave Petition, Mumbai Sessions Court, Salman Khan bail, Salman Khan jailed, Salman Khan news, Salman Khan convicted, Salman Khan hit-and-run case, 2002 Mumbai hit and run case, Salman Khan trial, Salman Khan Found Guilty, Aamir Khan, Aamir met Salman

A petition has been filed in the Supreme Court seeking cancellation of the bail given to the Bollywood superstar Salman Khan by the Bombay High Court

ITEMVIDEOS: సల్మాన్ బెయిల్ రద్దుపై పిటీషన్, క్యూ కట్టిన సెలబ్రీటీలు

Posted: 05/07/2015 06:02 PM IST
Salman khan interim bail in hit and run case challenged in sc

బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఒక న్యాయవాది గురువారంనాడు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సల్మాన్‌ ఖాన్‌పై వచ్చిన అభియోగాలన్నీ రుజువైనట్టు సెషన్స్ కోర్టు తీర్పు చెప్పిన అనంతరం మళ్లీ బెయిల్‌ ఇవ్వడాన్ని ఆ న్యాయవాది ఆక్షేపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్  సేనకు చెందిన నేత, అడ్వకేట్ అఖిలేష్ చౌబే.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సల్మాన్‌ ఖాన్‌ బెయిలును వెంటనే రద్దు చేసి ఆయనకు విధించిన జైలుశిక్షను అమలు చేయాలని ఆయన కోరారు. సెషన్స్ కోర్టు నుంచి పూర్తి తీర్పు కాఫీ అందకపోవడంతో చేత బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అటు సల్మాన్ ఖాన్ కు రాజకీయ, సినీ ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తాయి. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ లోని సల్మాన్ నివాసానికి ప్రముఖులు పోటెత్తారు. సల్మాన్ ను కలిసిన వారిలో రాజకీయ నేతలు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సింగర్స్, సంగీత దర్శకులు ఉన్నారు. మహారాష్ట్ర  నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, కాంగ్రస్ నేత నితేశ్ రాణెలతో పాటు సినీ తారలు ఆమిర్ ఖాన్, రాణి ముఖర్జీ, బిపాసా బసు, ప్రీతి జింతా, సోనాక్షి సిన్హా, సనా ఖాన్, సంగీతా బిజ్లానీ, మలైకా ఆరోరా, డైసీ షా, ప్రేమ్ చోప్రా, సునీల్ శెట్టి, నిఖిల్ ద్వివేది, పులకిత్ శర్మ, నిఖిల్ ద్వివేది తదితరులు సల్లూ భాయ్ ని కలిసి సంఘీభావం తెలిపారు. 2002 హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, బాంబే హైకోర్టు 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  hit-and-run case  Supreme Court  celebrities  

Other Articles