allegations arose on parvathipuram makkuva sub inspector

Two women allegations on makkuva si

makkuva SI, vizianagaram district, allegations, parvathipuram, makkuva sub inspector, crime against women, violence against womwn, harrasment against women, makkuva si harrasmentt

allegations arose on parvathipuram makkuva sub inspector

ఈ పోలీసోడి అసాధ్యం కూల.. ఇలాంటోరు కూడా వుంటారా..?

Posted: 05/06/2015 09:21 PM IST
Two women allegations on makkuva si

తాను అచ్చం సినిమా పోలీసు అనుకున్నాడు అతను. అయితే సినిమాల్లో హీరోయిజం కనబర్చే గబ్బర్ సింగ్ లాంటి పోలీసు కాదు.. విలన్ పాత్రలలో తనకు తాను అన్వయించుకున్నాడు. ఏకంగా తన వద్దకు వచ్చే పిర్యాదు దారులతో కూడా సెటిల్ మెంట్ మాట్లాడుకుని.. తన అసలు నైజాన్ని బయటపెడుతున్నాడు. పోకిరి చిత్రంలో అశీష్ విద్యార్థి పాత్ర కన్న హీనంగా ఈ పోలీసు గురించి తెలుసుకుందామా..? కుటుంబ సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.. తనతో రెండు రోజుల పాటు గడిపితే కానీ సమస్యను పరిష్కరించనని తేల్చి చెప్పి.. సెటిల్ మెంట్ చేసుకుంటున్న నీచ పోలీసు ఇతను. అంతేకాదండోయ్.. అయనే అలాగని అనుకుంటే.. అయనగారి తల్లి కూడా మరీనూ....‘అటెండరు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎస్‌ఐ తల్లి మూడు లక్షలు తీసుకుంది.’.... విజయనగరం జిల్లా మక్కువ ఎస్‌ఐ బి.రవీంద్రరాజుపై ఓ మహిళ, ఓ యువతి చేసిన ఫిర్యాదులు కలకలం రేపాయి.

మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన బొంగు రవణమ్మ, ఆమె తండ్రి  బొంగు సింహాచలం.., విశాఖపట్టణానికి చెందిన ఎస్‌కె ఫాతిమాలు మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు సురేష్ తనను పట్టించుకోవడం లేదంటూ బొంగు సింహాచలం పోలీసులకు పిర్యాదు చేశాడు. తమకున్న మూడెకరాల పొలాన్ని కొడుకు, కూతురికి సమానంగా పంచిపెడతానని, విశాఖలో ఉంటున్న కూతుర్ని కూడా తీసుకొని రావాలని ఎస్‌ఐ మార్చి 15న ఫోన్‌చేశారు. 16న నరసింహంతో పాటు తానూ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పింది.

మొదట తమ నాన్నను లోపలకు పిలిచి రూ. 20వేలు ఇస్తే సమస్య పరిష్కరిస్తానని ఎస్ చెప్పడంతో.. అంత తాము ఇచ్చుకోలేమని.. రూ. 500 లేదా, వెయ్యి ఇచ్చుకోగలమని తమ నాన్న తెలిపాడని బాధితురాలు తెలిపింది.. అనంతరం తనను లోపలకు పిలిచిన ఎస్ఐ తనతో రెండు రోజులు గడిపితే తనకు వాటా ఇప్పిస్తానని ఎస్‌ఐ అన్నారని చెప్పింది. తన దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. తాను భయంతో ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తుపాకీ చూపించి ఈ విషయం ఎక్కడైనా చెబితే కాల్చేస్తానంటూ బెదిరించారని తెలిపింది. మేము విశాఖ వెళ్లి జరిగిన విషయాన్ని మాకు తెలిసిన ఓ లాయర్‌తో చెప్పగా ఆయన మాకు ధైర్యం చెప్పి ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేయాల్సిందిగా సూచించారు. మేము ఫిర్యాదులు చేయగా అప్పటినుంచి విశాఖలో  ఉంటున్న ఎస్‌ఐ మనుషులు ఫిర్యాదు వాపసు తీసుకోమని ఓసారి ఇంటికి వచ్చి బెదిరించారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు విచారణ జరుగుతుందని వచ్చామని బాధితురాలు తెలిపింది.


‘మక్కువ ఎస్‌ఐ బి. రవీంద్రరాజు తల్లి సత్యవతి చేసిన ఘణకార్యంపై ఫాతిమా అనే మహిళ కూడా ఏఎస్పీకి పిర్యాదు చేసింది. విశాఖలో నివాసం వుంటున్న తన కాలనీలో నివాసముందే పాథిమాకు తన కుమారుడితో చెప్పి పోలీసు స్టేషన్‌లో అటెండరు ఉద్యోగం ఇప్పిస్తానని రెండుసార్లు రూ. 1.50 లక్షలు చొప్పున రూ.3లక్షలు తీసుకుంది. డబ్బులిచ్చాక పలుమార్లు ఇంటిచుట్టూతిరిగినా ప్రయోజనం లేదు. తరువాత  ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయిందని తన గోడును వెళ్లబోసుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : makkuva SI  vizianagaram district  

Other Articles