sivaji says that he continues his fast even in the hospital

Sivaji fast unto death broken by police on fourth day

Sivaji, Hero Sivaji, BJP politician Sivaji, YSRCP support to Sivaji's 'Fast unto Death', sivaji slams bjp over ap special statue, YSRCP, YSRCP MLA Jogi Ramesh, Sivaji Hunger Strike, Andhra Pradesh Special Status, AP Special Status, ap special status, indefinite fasting, BJP, modi,

Telugu cinema hero turned BJP politician Sivaji, fast unto death with the aim of achieving special status to Andhra Pradesh is broken by police on fourth day

శివాజీ అమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

Posted: 05/06/2015 09:16 PM IST
Sivaji fast unto death broken by police on fourth day

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కల్పించాలంటూ నటుడు శివాజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత నాలుగు రోజులుగా జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న శివాజీ అరోగ్యం విషమించడంతో వైద్యుల సూచనల మేరకు పోలీసులు దీక్షను భగ్నం చేసి.. గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీక్ష కారణంగా శివాజీ చాలా నీరసించారని, ఆయన శరీరంలో కీ టోన్స్ తగ్గడంతో పాటు, ఐదుకేజీలు బరుకు కూడా తగ్గారనన్నారు.. ఇవాళ ఉదయం శివాజీకి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పోలీసులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన నగరంపాడు పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని శివాజీని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సైతం దీక్షను కొనసాగించనున్నట్లు శివాజీ తెలిపారు.
 
కాగా శివాజీని ఆస్పత్రికి తరలించే సమయంలో పలువురు కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు శివాజీ చేస్తున్న దీక్షకు మాలమహానాడు అధ్యక్షుడు కారంశివాజీ పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. శివాజీ దీక్షకు ఇచ్చిన 48 గంటల అనుమతి ముగియడంతో.. దీక్షాస్థలికి వచ్చిన పోలీసులు దీక్షను నిలిపేయాలని కోరారు.. అయితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్షను విరమించేది లేదని శివాజీ తేల్చి చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా ఇవాళ శివాజీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తప్పనిపరిస్థితిలో దీక్ష భగ్నం చేసి తరలించారు. ఈ క్రమంలో మాలమహానాడు నేతలు ప్రతిఘటించినప్పటికీ పోలీసులు ఎవరినీ లెక్కచేయకుండా బలవంతంగా శివాజీని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivaji  ap special status  indefinite fasting  BJP  modi  

Other Articles