'It Is a Scam', Says Supreme Court on Scheme For Permanent Shelter Homes

Supreme court calls urban shelter scheme a big scam

Supreme Court, urban shelter scheme, a big scam, urban homeless, National Urban Livelihood Mission, permanent shelter homes, nulm, social justice bench, 9 lakh urban homes,

The Supreme Court on Friday smelt a rat in the Centre's National Urban Livelihood Mission (NULM) as it found that only 208 houses were built though the Centre had released Rs 1,078 crore to states to construct shelters for 9 lakh urban homeless.

కేంద్ర పట్టణ గృహనిర్మాణ పథకం.. పెద్ద కుంభకోణం: సుప్రీంకోర్టుt

Posted: 04/25/2015 09:00 PM IST
Supreme court calls urban shelter scheme a big scam

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మెట్టికాయ పడింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ పట్టణ నివాసయోగ్య పథకం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) ( ఎన్ యు ఎల్ ఎం)  వెనుక పెద్ద కుంభకోణం దాగివుందని అత్యున్నత న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పట్టణ నివాస సముదాయాల (అర్బన్ షెల్టర్ హోం) నిర్మాణం పేరిట వందల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసినా.. ఇళ్ల నిర్మాణంలో జాప్యం ఎలా జరిగిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇళ్ల సముదాయాలను చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు అప్పగించగా, పనులు జరగకపోవడంపై ఆక్షేపించింది.
 
ఈ ఇళ్ళ నిర్మాణంపై సోషల్ జస్టిస్ బెంచ్ లో దాఖలైన పిటీషన్‌ను న్యాయమూర్తి మదన్ బి లోకుర్, యు లలిత్‌లతో కూడి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'రూ.1,078 కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తే కేవలం 208 ఇళ్లు నిర్మాణం మాత్రమే జరగడం ఏంటని నిలదీసింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ చూస్తుంటే మొత్తం విషయం అర్థం అవుతోంది. ఇదో పెద్ద కుంభకోణంలా ఉందని వ్యాఖ్యానించింది.
 
అంతకుముందు పట్టణ పేదలకు షెల్టర్లపై మహారాష్ట్రకు రూ.170 కోట్లివ్వగా, ఒక్కటీ కట్టలేదని, ఉత్తరప్రదేశ్‌కు రూ.180 కోట్లివ్వగా, 37 షెల్టర్లు కట్టారని కేంద్రం కోర్టుకు తెలిపింది. మొత్తం వ్యవహారంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఏ రాష్ట్రం ఎలా వెచ్చించిందో తెలియజేయాలని, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  urban shelter scheme  scam  

Other Articles