Nepal earthquake: telugu pilgrims trapped in kathmandu are safe, while mountaineers strucked up on everest

Telugu pilgrims trapped in kathmandu are safe while mountaineers strucked up on everest

earthquake, yoga guru baba ramdev, telugu pilgrims safe, trapped, kathmandu, mountaineers, struck, Mt. everest, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and some injuries, eyewitnesses say.

తెలుగు యాత్రికులు సేఫ్.. తృటితో తప్పించుకున్న బాబా రాందేవ్..

Posted: 04/25/2015 07:47 PM IST
Telugu pilgrims trapped in kathmandu are safe while mountaineers strucked up on everest

గత రెండు మూడు తరాలగా కనీవినీ ఎరుగని పెను భీభత్సాన్ని ఇవాళ సంభవించిన భూకంపం సృష్టించడంతో అక్కడి ఫుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లని తెలుగువారు ఎలా వున్నరాన్న ఉత్కంఠకు తెరపడింది. నేపాల్ పర్యటనకు వెళ్లి భూకంపంలో చిక్కుకున్న హైదరాబాదీలందరూ సురక్షితంగా ఉన్నారు. సాయిబాబా ట్రావెల్స్ ద్వారా  ఖాట్మండ్ వెళ్లిన హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండులో సురక్షితంగా వున్నారన్న విషయాన్ని టూర్ ఆర్గనైజర్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నుంచి 25 మంది యాత్రికులు నేపాల్ వెళ్లారు. తామంతా ప్రస్తుతం పశుపతినాథ్ ఆలయానికి సమీపంలో ఉన్నట్లు గౌరీశంకర్ చెప్పారు. ప్రకంపనలు రాగానే అందరం రోడ్డుమీదకు వచ్చేశామని ఆయన అన్నారు. తాము ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి బయల్దేరామని, కాశీ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఖాట్మాండు వచ్చామని ఆయన వివరించారు.

వీరితో పాటు  కాగా, గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి వెళ్లిన వారు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరిన 25 మంది కూడా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం వచ్చింది. నేపాల్ లోని పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. రాందేవ్ బాబా ఉన్న వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా మాత్రం తృటిలో తప్పించుకున్నారు.

కాగా, మరో 125 మంది భారతీయులు ప్రస్తుతం నేపాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి 80 మంది యాత్రికులు నేపాల్ వెల్లారు. వీరిలో 20 మంది పర్వతారోహణ కోసం వెళ్లారు. వీళ్ల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో వీళ్ల విషయమై తీవ్ర ఆందోళన నెలకొంది.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  telugu pilgrims safe  kathmandu  mountaineers  struck  Mt. everest  baba ramdev  

Other Articles