telugu film unit group trapped in nepal | kamakhya temple | temple collapsed

No word from vetakaram film unit in nepal

earthquake, telugu film unit group trapped in nepal, kamakhya temple, temple collapse, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

The film unit of Vetakaram, an upcoming Telugu movie film unit group is reported to have gone to Nepal for shooting is trapped in earth quake

నేపాల్ లో వెటకారం చిత్ర యూనిట్.. ఆచూకీ ఎక్కడ..?

Posted: 04/25/2015 05:13 PM IST
No word from vetakaram film unit in nepal

ఎనమిది దశాబ్దాలుగా ఎరుగని భూకంపం నేపాల్ ను అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మికతకు, చక్కని పర్యాటక ప్రాంతానికి కేంద్రంగా నిలిచిన నేపాల్ లో యాత్రకు వెళ్లిన యాత్రికులతో పాటు సినీమా షూటింగ్ కోసం వెళ్లిన బృందం కూడా చిక్కుకోవడంతో అక్కడ భూకంపంలో చిక్కుకున్న తెలుగువారి సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారు దాదాపు 40 మందికి పైగా ఖాట్మండులో చిక్కుకుపోయినట్లు సమాచారం. కాగా 'వెటకారం.కామ్'  అనే టాలీవుడ్ చిత్ర బృందానికి చెందిన 20 మంది కూడా ప్రకంపనల తాకిడి గురైనట్లు తెలుస్తోంది. భూకంపం ధాటికి వారు ఎక్కడున్నది, ఏమైయ్యారన్న వివరాలను తెలుసుకునేందుకు వారు కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా యూనిట్ సభ్యుల ఫోన్లు కూడా పనిచేయడం లేదని బాధితుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'వెటకారం.కామ్' అనే తెలుగు సినిమా చిత్రీకరణ కోసం నేపాల్‌కు వెళ్లినట్లు సమాచారం.

కుప్పకూలిన కామాఖ్య దేవి అలయం..

భూకంపం ప్రభావంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యాదేవి ఆలయం కుప్పకూలింది. ఆలయం పైకప్పు కూలిపోయింది. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇది పురాత భవనం కావడంతో భవనంలోని చాలా భాగాలు కూలిపోయాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటానికి తోడు.. భవనం కూడా పాతబడిపోవడంతో దాని పైకప్పు కూలిపోయిందని భావిస్తున్నారు. తర్వాత కొంతసేపటికి లోపలకు వెళ్లి, నష్టం ఏమాత్రం వాటిల్లిందన్న విషయాన్ని భక్తులు, ఆలయ పూజారులు పరిశీలించారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  'Vetakaram' film unit  nepal  trapped  

Other Articles