Nepal earthquake: telugu pilgrims trapped in kathmandu while mountaineers strucked up on everest

Telugu pilgrims trapped in kathmandu while mountaineers strucked up on everest

earthquake, telugu pilgrims, trapped, kathmandu, mountaineers, struck, Mt. everest, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and some injuries, eyewitnesses say.

అక్కడ తెలుగు యాత్రికులు, ఇక్కడ పర్వతరోహకులు.. చిక్కుకున్నారు

Posted: 04/25/2015 04:01 PM IST
Telugu pilgrims trapped in kathmandu while mountaineers strucked up on everest

గత రెండు మూడు తరాలు కనీవినీ ఎరుగని పెను భీభత్సాన్ని ఇవాళ సంభవించిన భూకంపం సృష్టించింది. ఎక్కడ చూసినా విషాధ చాయలు, బీతావహ వాతావరణం అలుముకుంది. ఈ తరుణంలో నేపాల్ దేశ పర్యటనకు వెళ్లిన తెలుగు యాత్రికులు ఖట్మాండులో చిక్కుకుని.. అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండులో చిక్కుకున్నారు. వారం రోజుల క్రితం వారు సాయిబాబా ట్రావెల్స్ ద్వారా  ఖాట్మండ్ వెళ్లారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో వారు చిక్కుకున్నారు. నేపాల్ లో సంభవించిన భూకంపం అక్కడ పెను విషాదాన్ని నింపిందన్న సమాచారంతో  హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమవారిని హైదరాబాద్కు రప్పించాలని వారు కోరుతున్నారు.

ఖట్మాండులో 1934లో సంభవించిన భూకంపం తరువాత అంతటి ఉదృత్తితో కంపించి బీభత్సం సృష్టించింది ఇవాలో సంభవించిన భూకంపం. దీని ప్రకంపనలతో ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 1, 2 బేస్ క్యాంపులు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం మీద చిక్కుకుపోయారు. నేపాల్, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో వచ్చిన భూకంపం కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్నాళ్ల ముందుగానే బయల్దేరిన పర్వతారోహకులు ఇప్పుడు అక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  telugu pilgrims  trapped  kathmandu  mountaineers  struck  Mt. everest  

Other Articles