chandrababu naidu conducted pressmeet | Ap capital city amaravati history

Ap cm chandrababu naidu press meet on capital city amaravathi

chandrababu naidu, chandrababu naidu press meet, ap capital city updates, ap capital city amaravati, amaravati city details, chandrababu naidu updates, chandrababu naidu singapore tour, babu press meet amaravati

ap cm chandrababu naidu press meet on capital city amaravathi : After singapore tour.. ap cm chandrababu naidu conducted press meet on capital city amaravathi. He explain about capital city and the history of amaravathi name.

వాస్తు-పేరు బాగున్నాయి.. ఇక దూసుకెళ్లడమే!

Posted: 04/01/2015 09:04 PM IST
Ap cm chandrababu naidu press meet on capital city amaravathi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించిన విషయం తెలిసిందే! సింగపూర్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న బాబు.. మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీ రాజధానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవ్యాంధ్ర రాజధానికి ‘అమరావతి’ పేరు ఖరారు చేశామని తెలిపిన ఆయన.. దానికి క్యాబినెట్ ఏకగ్రీవ ఆమోదం లభించిందని తెలిపారు. పైగా.. రాజధాని వాస్తుపరంగా పవర్ ఫుల్ అని, పేరులోనూ పవర్ వుందన పేర్కొన్న బాబు.. ఇక దూసుకెళ్లడమే తరువాయి అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే బాబు ‘అమరావతి’ పేరుకుగల ప్రాముఖ్యత, దానివెనుకున్న చరిత్రను వివరించారు. ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతికి ఖ్యాతి వుందని ఆయన తెలిపారు. అలాగే సుమారు 400 ఏళ్లపాటు శాతవాహనుల రాజధానిగా అమరావతి విలసిల్లిందని అన్నారు. ‘అమరావతి’ బౌద్ధులకు పరమ పవిత్రమైనదని పేర్కొన్నారు. శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన సంప్రదాయాల్లో ఈ పేరుకు మంచి గుర్తింపు వుందని, అందుకే రాజధానికి ‘అమరావతి’ పేరు ఖరారు చేశామని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికైన వారసత్వ నగరాల్లో అమరావతి కూడా వుందని బాబు పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రతినిధులతో బాబు రాజధాని విషయమై చర్చలు జరిపిన విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే రాజధానిపై ‘మాస్టర్ ప్లాన్’ దాదాపుగా సిద్ధమైందని తెలిసింది. బాబు ఇచ్చిన సూచనల మేరకు జూన్ నెల నాటికి రాజధానికి సంబంధించి బృహత్తర ప్రణాళికను సింగపూర్ సిద్ధం చేయనుంది. ఇప్పటికే ఏపీ రాజధానిపై 90 శాతం మాస్టర్ ప్లాన్ పూర్తైనట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chandrababu naidu  amaravati city  ap capital city  

Other Articles