retired army officer grandson Jaikishan killed coolie for 100 rupees | Agra Crime News

Jaikishan killed coolie named pappu for 100 rupees in agra

jaikishan killed coolie, man killed for 100 rupees, jaikishan killed coolie for 100 rupees, army grandson killed coolie for 100 rupees, retired army office major ml upadhya, agra crime news

Jaikishan killed coolie named pappu for 100 rupees in agra : A retired army officer major ml upadhya grandson jai kishan killed a coolie named pappu for only one hundred rupees in agra which goes viral now.

ఆర్మీ ఆఫీసర్ మనవడు.. రూ.100 కోసం హత్య చేశాడు

Posted: 04/01/2015 09:31 PM IST
Jaikishan killed coolie named pappu for 100 rupees in agra

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆర్మీలో ఆయనొక ఒకప్పుడు ఆఫీసర్! ప్రస్తుతం రిటైర్డ్ అయిన ఆయన మార్గదర్శకంలో పెరిగిన మనవడు మాత్రం సభ్యసమాజం తలదించుకునే విధంగా అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మానవీయత ఏ కోణంలోనూ కనిపించని విధంగా మారిన అతగాడు.. కేవలం రూ.100 కోసం ఓ సాధారణ కూలీని అతిదారుణంగా హింసించి, చివరికి హతమార్చాడు. ఆగ్రాలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జైకిషన్.. స్థానిక దేవాలయంలో పప్పూ అనే కూలీతో ఓ పని చేయించాడు. ఆ దేవాలయంలో తన పని ముగించిన అనంతరం ఆ కూలీ తనకు రావాల్సిన వంద రూపాయల కోసం జైకిషన్ అడిగాడు. అతను మళ్లీ ఇస్తానని చెప్పగా.. తనకు ఆ డబ్బుతో ఎంతో అవసరముందని, ఇవ్వాల్సిందేనని జైకిషన్ ను నిలదీశాడు. దీంతో కోపాద్రిక్తుడైన జైకిషన్.. పప్పూను నేలమీద పడేసి అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. విచక్షణారహితంగా అతడి మీద దాడి చేశాడు. దాంతో పప్పూ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అక్కడి నుంచి జైకిషన్ పరారయ్యాడు.

పప్పూ మరణించాడన్న విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యులు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకుని మేజర్ ఇంటిమీద రాళ్లదాడికి దిగారు. ఆస్తులు ధ్వంసం చేశారు... అడ్డుకున్న మేజర్ పై కూడా దాడిచేశారు. తమకు జైకిషన్ ను అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేలోపే పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన మేజర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చించారు. చివరగా కేసు నమోదు చేసి, జై కిషన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : man killed for 100 rupees  jaikishan killed coolie for 100 rupees  

Other Articles