Inter girl shot dead in Bengaluru by psycho office boy

Girl student rejects love killed by gunfire

girl student rejects love killed by gunfire, psycho lover, gun fire in white feild school in bengaluru, girl student shot dead in bengaluru, Karnataka Home Minister K J George, City Police Chief M N Reddi, Senior inter student gowtami shot dead, Senior inter student shirisha injured, student killed, gowtami, sirisha, mahesh, bangalore Whitefield, harassment, fire,

An 18-year-old girl was shot dead and her friend injured by an office boy of a residential school here, police said.

ప్రేమించలేదని కాల్చిచంపిన ‘సైకో’.. అటెండర్

Posted: 04/01/2015 11:30 AM IST
Girl student rejects love killed by gunfire

బెంగుళూరులో మరో ధారుణం జరిగింది, తనను ప్రెమించమని కొరినా.. నిరాకరించిన ఓ ఇంటర్ విద్యార్థినిపై.. పాఠశాల అటెండర్ కాల్పలు జరిపిప ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రేమికురాలు మరణించగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులోని ప్రముఖ కార్పోరేట్‌ వైట్‌ఫీల్డ్‌ కాడుగోడి ప్రగతి స్కూల్లో జరిగిన ఘటనతో సహ విద్యార్థినులు భయంతో భీతిల్లిపోయారు. సైకో అటెండర్ సృష్టించి భీభత్సంతో భయాందోళన
 
వివరాల్లోకి వెళ్తే..  వివరాల్లోకి వెళితే ప్రగతి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న గౌతమి అదే కాలేజీ హాస్టల్లో ఉంటోంది.  కాగా అదే కళాశాలలో ఆఫీస్ బాయి్ గా పని చేస్తున్న మహేష్ గత కొంతకాలంగా గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమె నిరాకరించటంతో అతడు కక్ష గట్టాడు. గత రాత్రి 11.30 గంటల సమయంలో మహేష్ ...హాస్టల్కు వెళ్లి గౌతమితో ప్రేమ విషయంలో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఆమె నిరాకరించటంతో కోపం పట్టలేని అతడు సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉండే గన్తో కాల్పులు జరిపాడు.

ఈ సంఘటనలో గౌతమి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థిని శిరీష గాయపడింది. శిరీషను చికిత్స నిమిత్తం వైదేహీ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలు గౌతమి స్వస్థలం అనంతపురం జిల్లా పావుగడ. ఆమె కుటుంబ సభ్యులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇచ్చింది. మరోవైపు శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన సమాచారం తెలియడంతో కర్ణాటక హోం శాఖ మంత్రి కె జే జార్ఝ్, బెంగుళూరు నగర పోలిస్ కమీషనర్ ఎం ఎన్ రెడ్డి సహా పలు శాఖా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరకున్నారు. నిందితుడు మహేష్ కోసం మూడు ప్రత్యేక పోలిస్ బృందాలు రంగంలోకి దిగాయని.త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని బెంగుళూరు పోలిస్ కమీషనర్ రెడ్డి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student killed  gowtami  sirisha  mahesh  bangalore Whitefield  harassment  fire  

Other Articles