love couple sucide in medak, after parents disagree their marriage

Lovers sucide on railway track in medak distirict

lovers committed sucide, medak lovers commits sucide, lovers committs sucide on railway track, committed Suicide, Lovers Suicide, Railway Track, medak, parents disagree lovers marriage

Yet another love couple committs sucide on railway track in medak, after mehaboobnagar, ananthapur

కలసి జీవించే అవకాశం లేదు.. అందుకని ఈ లోకాన్ని..

Posted: 04/01/2015 11:34 AM IST
Lovers sucide on railway track in medak distirict

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేకకు పెద్దలు అంగీకరించడంలేని మనస్థాపం చెందిన ప్రేమజంట.. కలసి జీవించలేని సమాజంలో బతకడం ఎందుకనుకున్నారో ఏమో.. అర్థాంతరంగా తనవును చాలించారు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతూ.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తుప్రాన్ మండలం, పడాల్‌పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20) స్థానిక ప్రైవేటు డిగ్రి కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతుంది. మేడ్చల్ కు చెందిన నగేష్(24) స్తానికంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్న వీరిద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.. ఇదిలావుండగానే మౌనికకు ఇటీవల వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులు బుధవారం తెల్లవారుజామున బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బలవన్మారణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు, స్థానికులు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఘటనపై స్థానిక సర్పంచ్ వెంకట్‌గౌడ్ కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారమందిచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medak  suicide  Lovers couple  Railway Track  

Other Articles