toll increases to seven in massive crackers blast at vizag godown, Crackers blast, seven died

Toll increases to seven in massive crackers blast at vizag godown

seven died, crackers godown blast, blast in crackers godown, Crackers blast, crackers blast at vizag godown, massive crackers blast at vizag, toll increases to seven in crackers blast

toll increases to seven in massive crackers blast at vizag godown which occured on sunday evening

విశాఖ విషాదంలో ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య

Posted: 03/30/2015 10:46 AM IST
Toll increases to seven in massive crackers blast at vizag godown

విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడు గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఆదివారం సాయంత్రం సంభవించిన ఈ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నవారిలో ఇవాళ మరోకరు మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. ఆదివారం సంభవించిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో మడుగుల నానాజీ అనే వ్యక్తి ఓ షెడ్‌లో నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.

ప్రమాదం సంభవించగానే గ్రామంలో దట్టమైన పొగలు ఆవరించాచి. ఈ ఘటనలో గోకులపాడుకు చెందిన లింగంపల్లి శేషమ్మ (45), నూతి సత్యవతి(35), పాయకరావుపేటకు చెందిన భూపతి సత్తిబాబు(45), దార్లపూడికి చెందిన భూపతిలోవరాజు (38)  సజీవ దహనమయ్యారు. సమ్మంగి రమణ అనే వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. పేలుడు ధాటికి ఓ వ్యక్తి సమీపంలోనున్న బావిలో పడినట్లు తెలుస్తోంది. గాయపడిని ఆరుగురిని  విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గోకులపాడు పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందడంపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ తీవ్ర సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబీకులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crackers godown blast  seven died  vizag  

Other Articles